
ఇప్పటి వరకు వెలువడిన అనధికారిక సర్వేల ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ గెలుపు చాలా కష్టం అని తెలుస్తోంది. ఒకవేళ టైం బాగాలేకపోతే ఎన్నికల్లో ఓడిపోయినా ఆశ్చర్య పడక్కర్లేదు అని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన మరియు బీజేపీలు ఒక్కటిగా మారి వైసీపీని ఓడించాలన్న తెరవెనుక ప్రణాళికలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు జనసేన లేదా బీజేపీలు అధికారికంగా వెల్లడించకుండా గేమ్ ఆడుతున్నాయని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక వైసీపీ ఓడిపోతుంది అనడానికి ముఖ్యకారణాలుగా కొన్నింటిని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాటిలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అతి ముఖ్యమైన రాజధాని ఎంపిక మరియు నిర్మాణం విషయంలో వివాదాలు రావడం. అందుకు కారణం ఏపీ ప్రభుత్వం కావడం.
ఎన్నికల నాడు ఇచ్చిన చాలా హామీలలో మద్యపాన నిషేధం ఒకటి.. ఈ హామీని చూసి లక్షల మంది అక్కచెల్లెమ్మలు జగన్ కు ఓటేశారు. తమ ఇళ్లల్లో తాగుడుకు బానిస అయిన మగాళ్లు మద్యపాన నిషేధంతో మారుతారని కలలు కన్నారు. కానీ అనుకున్నది ఒకటి అయినది మరొక్కటి. పాలనలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ఇంకా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఎటువంటి నిషేధం జరగలేదు సరికదా.. ఇంకా మద్యం ధరలు ఎక్కువై అధికంగా డబ్బును వృధా చేస్తున్నారంటూ ఆడకూతుర్లు లబోదిబోమంటున్నారు. మిగిలిన ఈ కొద్ది సమయంలో అనుకున్నది చేసి ప్రజల మెప్పును పొందుతాడా అన్నది చూడాలి. ఒకవేళ అలా జరగలేదంటే ఇదే జగన్ ను ఓడించే పాశుపతాస్త్రం కాగలదు.