టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని ఆయన అభిమానుల కల.ఆ కలను నెరవేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ ఎంతగానో కష్టపడుతున్నాడు. సినిమాలు చేస్తూనే ప్రజల్లోకి వెళుతున్నారు.ఇక 'వారాహి'తో యాత్రకు సిద్ధమవుతున్నారు.నిజానికి పవన్ కళ్యాణ్ గోల్ కూడా సీఎం అవ్వడమే. కేవలం తన జనసేన పార్టీని నడిపేందుకు మాత్రమే పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అయితే ఆయన చేసే సాయం కొండంత అయితే అది బయటకు వచ్చింది చాలా తక్కువ. తన చుట్టూ వుండే కొన్ని కుటుంబాలకు ఆయన సాయం చేస్తాడు. ఆయన చేసే సాయం ఆయన ఫ్యాన్స్ ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది.తాజాగా ఒక ముసలావిడ పవన్ గురించి చెప్పిన నిజాలు ఇంకా ఆమె మాటలు స్ఫూర్తిని పంచాయి.అన్ స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే అంటూ బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షోకు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. 


ఈ లేటెస్ట్ సెకండ్ ప్రోమో తాజాగా విడుదలైంది.అది క్షణాల్లో వైరల్ గా మారింది. ఒక ముసలావిడ ఈ స్టేజీపైకి వచ్చి బాలయ్య ఇంకా పవన్ లతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అయ్యాయి.ఆ ముసలావిడ స్టేజీపైకి రాగానే పవన్ కళ్యాణ్ ఆప్యాయతతో ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. 'నా ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. కానీ ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు. ఆ కొడుకే ఈ పవన్ కళ్యాణ్. పవన్ సీఎం అయ్యాక అప్పుడు నేను చచ్చిపోతాను' అంటూ ఎమోషనల్ అయ్యింది. దెబ్బకు పవన్ కళ్యాణ్ ఆమె కాళ్లకు నమస్కరించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక పోతే ఈ ప్రోమోలో బాలయ్య, పవన్ ఎక్కువగా రాజకీయ అంశాలు గురించి ఎక్కువగా మాట్లాడుకున్నట్టు మనకు అర్ధమవుతుంది. అధికార పార్టీ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నట్లు అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: