వాతావరణం: మండే ఎండలు లేవు.. ఇక వర్షాలే?

ఈ సంవత్సరం ఎండలు బాగా మండిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం ఎండలు కొత్త రికార్డులను సృష్టించాయి. ఎండలతో జనాలు చాలా తీవ్రంగా అల్లాడిపోతున్నారు. మండే ఎండలు కారణంగా ప్రజలు విల విల లాడిపోతున్నారు. అలాగే చాలా మంది కూడా వడ దెబ్బ బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు.ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అని ఎదురు చూస్తున్న జనానికి చాలా చక్కటి చల్లటి కబురు అందించింది భారత వాతావరణ శాఖ.ఇక ఈ మండే ఎండల వేడి తగ్గుతుందని ప్రకటించింది. బుధవారం నాటి నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి.. ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని వాతావరణ తెలిపింది. ఇప్పుడు దేశంలో హీట్ వేవ్ ముగిసిందని వెల్లడించింది.అలాగే పలు రాష్ట్రాల్లో కూడా ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. పలు రాష్ట్రాలకు ఆరేంజ్‌ అలర్ట్‌ జారీ చేసిది. 


రాజాస్తాన్‌, పంజాబ్‌, ఢిల్లీ, యూపీ, హర్యానా ఇంకా చంఢీఘడ్‌ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య ప్రాంతాల్లో కూడా బలమైన ఈదురు గాలులకు ఛాన్స్ ఉంది. మే25, 26 తేదీల్లో దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.ఇక అలాగే తెలుగు రాష్ట్రాల్లో అడపా దడపా వానలు కురుస్తూనే ఉన్నాయి. బుధవారం నాడు విశాఖ, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడింది. ఇటు తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షం వర్షం పడింది. అలాగే హైదరాబాద్‌లో బుదవారం నాడు మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతం అయి ఉంది.మొత్తానికి ఈ ఏడాది మండే ఎండలతో బాగా మండిపోతున్న జనాలకు వాతావరణ శాఖ ఈ చల్లటి న్యూస్ చెప్పి శాంతపరిచింది. అలాగే ఈదురు గాలులు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జనాలు కొద్దిగా జాగ్రత్తగా కూడా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: