చంద్రబాబు రాజకీయ పరిజ్ఞానం, చతురత గురించి అందరికి తెలిసిందే.. ఒక్కసారి అధికారం కోల్పోతే ఎదో విధంగా వచ్చే సారి మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా అయన ప్రణాళిక వేసుకుంటారు.. అలా చాల సార్లు సక్సెస్ అయ్యారు కూడా.. గతంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఎన్నో ప్రయాసలకోర్చి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు.. అయితే వచ్చిన ప్రతిసారి వాగ్దానాలను మర్చిపోవడం, ప్రజలను పట్టించుకోకపోవడంతో ఎన్నిసార్లు నమ్మి మోసపోవాలని చంద్రబాబు కు తగిన బుద్ధి చెప్పారు.. ఈ దెబ్బతో బాబు ఎన్ని నాటకాలు వేసినా ఇక అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు.. కానీ చంద్రబాబు తన ప్రయత్నాలు మాత్రం మానుకోవట్లేదు.. జగన్ ను ఏదోవిధంగా బ్యాడ్ చేసి పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలని చూస్తున్నారు..