విశాఖ జిల్లాలో బుల్లెట్ గాయంతో మరణించిన ఏఎస్పీ శశికుమార్ మృతదేహానికి హోం మంత్రి చినరాజప్ప నివాళులు అర్పించారు. కేజీహెచ్ ఆసుపత్రిలో శశికుమార్ మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు. శశికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభుాతి తెలిపారు.

ప్రభుత్వం శశికుమార్ కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని చినరాజప్ప ప్రకటించారు. ఘటనా స్థలంలో ఓ లేఖ దొరికిందని హోంమంత్రి తెలిపారు. శశి కుమార్ కుటుంబసభ్యులు అంగీకరిస్తే లేఖలోని వివరాలు బహిర్గతం చేస్తామని వెల్లడించారు.


కానీ చినరాజప్ప మాత్రం ఆ లేఖలో విషయాలను బయటపెట్టలేదు. సాక్షాత్తూ హోంమంత్రే ఉత్తరం చదివి.. తల్లిదండ్రులు అనుమతిస్తేనే బయటపెడతామని చెప్పేసరికి ఆ లేఖలో ఏం ఉందన్న ఉత్కంఠ నెలకొంది. శశికుమార్ ఆత్మహత్యకు సంబంధించిన కీలక ఆధారాలు, కారణాల ప్రస్తావన ఆ లేఖలో ఉండి ఉండొచ్చు.

కేవలం రెండేళ్ల క్రితమే ఎన్నో ఆశలతో ఐపీఎస్ గా ఎన్నికైన శశికుమార్ ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవాల్సిరావడానికి దారి తీసిన పరిస్థితులేంటన్నది అంతుబట్టకుండా ఉంది. ప్రేమ వ్యవహారం కానీ, వృత్తిపరమైన ఒత్తిళ్లుకానీ కారణం కావచ్చు. కానీ హోంమంత్రి కుటుంబ సభ్యుల అంగీకారం కోరుతున్నారంటే అది కుటుంబ వివాదం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏ విషయమైనా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేవరకూ ఓ నిర్థరణకు రాలేం కదా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: