హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం రేపిన ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నీలిమ మరణం అనుమానస్పదగా మారింది. గత రెండ్రోజుల కిందట హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ ఆఫీసుపై దూకి చనిపోయిన నీలిమ మరణంపై ఆమె తల్లిదండ్రులు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారి అనుమానాలే నిజమయ్యే సూచనలు అగుపిస్తున్నాయి. నీలిమ మ్రుతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆత్మహత్య మాత్రం కాదనీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. నీలిమ శరీరం మీద బలమైన గాయాలున్నట్లు వైద్యులు నిర్ధారించారు. నీలిమ రక్తాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ రిపోర్టు వచ్చిన తరువాత కానీ, ఏమీ చెప్పలేమనీ వైద్యులంటున్నారు. అయితే, నీలిమది మాత్రం హత్యేననీ అందరూ అంటున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. కంపెనీ పనిమీద విదేశానికి వెళ్లిన నీలిమ గత నెలలోనే ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ నెలలో మళ్లీ భర్తతో కలిసి అమెరికాకు పోవల్సి వుంది. ఈ క్రమంలో మొన్న ఇన్పోసిస్ ఆఫీస్కు వెళ్లింది. ఆఫీస్ నుంచి ఇంటికి మాట్లాడినట్లు నీలిమ తల్లిదండ్రులు చెప్పారు. అయితే, ఆఫీస్ 10వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్ఫోసిస్ ప్రతినిధులు అపోలో ఆసుపత్రిలో చేర్పించిన ఐదారుగంటల తరువాత సమాచారం అందించారు. దీన్ని బట్టి మొదటి నుంచీ నీలిమ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆఫీస్ లోనే ఏదో జరిగిందనీ, దీనీని ఇన్ఫోసిస్ ప్రతినిధులు దాచిపెడుతున్నారంటూ ఆమె తల్లిదండ్రులు, పిడబ్ల్యుఓ ప్రతినిధి సంధ్య తదితరులు ఆరోపిస్తున్నారు. వారు ఆరోపిస్తున్నట్లుగా ఇప్పుడు నీలిమ మరణం వెనక మిస్టరీ దాగి వుందనీ ఇప్పుడిప్పుడే తేలుతోంది. అనుమానాలు బలపడుతున్నాయి. నీలిమ 10వ అంతస్థు నుంచి దూకితే, ఆమె చెప్పులు, ఆమె హ్యాండ్ బ్యాగ్ మాత్రం వేర్వేరు అంతస్థులో పడి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 10వ అంతస్థు నుంచి దూకితే అపోలో ఆసుపత్రి దాకా బతికి ఉండటం కష్టం. ఇన్ఫోసిస్ ప్రతినిధులు ఆసుపత్రికి తీసుకెళ్లిన తరువాతనే నీలిమ చనిపోయిందంటున్నారు. ఇదే అనుమానాలకు తావిస్తోంది. పోస్టుమార్టంలో కూడా నీలిమ శరీరంపై బలమైన గాయాలున్నట్లు తేలింది. దీనితో నీలిమది ఆత్మహత్య కాకపోవచ్చనీ, హత్య చేసి ఎవరైనా తోసివేయవ్చనేది నీలిమ కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ. ప్రస్తుత పోస్టుమార్టం ఆధారంగా నీలిమది హత్యగానే తెలుస్తోంది. మొత్తానికి త్వరలోనే నీలిమ మరణం మిస్టరీ వీడిపోయే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: