నిర్భయావంటి చట్టాలు ఎన్ని అమలు చేస్తున్నా... బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నా.. చిన్నారులపై ఆకృత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా బంధువుల విద్యార్థులు.. మహిళలపై లైంగికదాడులకు పాల్పడుతున్నారు. గత ఏడాది రణస్థలం , మొన్న సోంపేట.. తాజాగా ఎచ్చెర్ల మండలంలో బాలికపై అత్యాచార సంఘటన వెలుగులోకి వచ్చింది. చెల్లి వరసైన బాలికపై ఓ యువకుడు కన్నేసి.. పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
వావి వరసలు మరిచి పోయి ఈ ఆఘాయిత్యానికి పాల్పడిన ఆ యువకుడిపై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళ్తే .. ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి  చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక (14) పై అదే గ్రామానికి చెందిన  వాసు (26) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో వాసు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసారు. 
ఈ ఘటనపై శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.లలిత దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో బాగంగా  బాలిక చదువుతున్న జెడ్పి ఉన్నత పాఠశాల విద్యార్ధునిలతో సిఐ లలిత విచారణ చేపట్టారు. నిందితుని పై సెక్షన్ 376 ఐపీసీ 3/4 , పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.
భాదీతురాలను చికిత్స నిమిత్తం కిమ్స్ కు తరలించారు. మహిళల రక్షణే ద్యేయంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు పదును పెట్టాయి. బాలికలు , మహిళలపై జరుగుతున్న ఆత్యాచారలు , వేధింపులు పుర్తిస్తాయిలో నియంత్రించేలా .. నిందితునిపై మరింత కఠినంగా వ్యవహరించేలా చట్టాలను సవరించాయి.  అయినా అత్యాచార ఘటనలు ప్రతీచోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వీటిపై మరింత నిఘాపెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాల్సివుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: