ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా జగన్ వ్యవహరిస్తున్న తీరుని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. చంద్రబాబు అయితే అంతెత్తున ఎగిరిపడుతున్నారు. నా వయసుకు సైతం తగిన గౌరవం ఇవ్వడంలేదని బాబు వాపోతున్నారు. ఇక తమ్ముళ్ళైతే జగన్ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.


ఇదిలా ఉండగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ వాడుతున్న భాషను బీజేపీకి చెందిన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు తప్పుపట్టారు. అసెంబ్లీలో గాడిదలు అన్న పదం ఉపయోగించడం ఏంటి అని ఆయన ప్రశ్నిచారు. జగన్ సీఎం ఆయన భాష కూడా తన  హోదాకు తగినట్లుగా హుందాగా ఉండాలని ఆయన అన్నారు. జగన్ దిగజారుడు భాష తీరును మార్చుకోవాలని గట్టిగానే సూచించారు.


ఇక తమ హైమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మొత్తానికి బాబుకు మద్దతుగా మాట్లాడుతూనే గాలి తీసేసే  న్యూస్ కూడా ఆయనే చెప్పారు సుమా.


మరింత సమాచారం తెలుసుకోండి: