ఏమిటో.. ఈ మధ్య ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురవుతున్నాయి. కోర్టులు వాటి నిర్ణయాలను తప్పు పడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గత చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంటులను (పిపిఏ) తప్పుపడుతూ వాటిని మళ్ళీ తిరిగి సమీక్షించాలని కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నారు.
జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాదాపు 48 పవర్ ఉత్పత్తిదారులు కోర్టుకు వెళ్లారు. కోర్టు జగన్ తీసుకున్న నిర్ణయానికి నాలుగు వారాలు నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చారు.. ఇది ఒక రకంగా జగన్ కు ఎదురుదెబ్బే.. దూకుడుగా అడుగులు వేస్తున్న జగన్ కు కాస్త ఇబ్బంది కరమైన పరిణామమమే..
అలాగే.. తెలంగాణ ప్రభుత్వం ఎర్రమంజిల్ లో ఉన్న భవనాన్ని కూల్చి అక్కడ కొత్త అసెంబ్లీని నిర్మించాలని అనుకుంటోంది. అయితే ఈ నిర్ణయాన్ని హైకోర్టును తప్పు పట్టింది. ఎర్రమంజిల్ భవనాలు పురాతన కట్టడాలు అని వాటిని కూల్చి అసెంబ్లీ కట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏమి వచ్చిందని ప్రశ్నించింది.
ప్రభుత్వం తరఫున ఆ భవనానికి నూట ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేసింది అని దానిని కూల్చడమే మంచిదని మున్సిపాలిటీ వద్ద అనుమతి తీసుకుంటామని చెప్పినా కూడా కోర్టు వారు అనుమతి ఇవ్వలేదు సరికదా అది పురాతన కట్టడం కాదు అనడానికి మీ దగ్గర ఆధారాలు చూపించమని అడిగారు. మరి చివరకు ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఈ కేసులో కనుక కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కెదురైతే.. అది ఆయనకు ఇబ్బంది కరంగానే మారుతుంది. చూడాలి ఏం జరుగుతుందో..?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి