జగన్ ఓ మోనార్క్.. ఆయన ఎవరి మాటా వినడు.. అధికారులు చెప్పినా పట్టించుకోడు.. ఆయన తనకు తోచిందే చేస్తారు.. జగన్ ధోరణితో రాష్ట్రానికి పెను ముప్పు వచ్చింది.. జగన్ కారణంగా రాష్ట్రం అధోగతి పాలవుతోంది.. జగన్ తన 90 రోజుల పాలనలోనే ఏపీని భ్రష్టుపట్టించాడు.. ఇవన్నీ టీడీపీ నేతల డైలాగులు అనుకుంటున్నారా..


కానే కాదు.. ఇవన్నీ.. ఎల్లో మీడియా ప్రజల్లో ఎక్కిస్తున్న విష ప్రచారం.. అవును.. క్రమంగా ఓ పద్దతి ప్రకారం జగన్ గురించి ఇలాంటి కామెంట్లను జనంలోకి తీసుకెళ్లేందుకు ఎల్లో మీడియా తంటాలు పడుతోంది. జగన్ విషయంలో ఎల్లో మీడియాకు ఇదేమీ కొత్త విషయం కాకపోయినా.. సీఎంగా ఆయన ఫెయిలయ్యాడని జనం అనుకునేలా చేసేందుకు పాపం చాలా తంటాలు పడుతున్నారు..


తాజాగా.. ఎల్లో మీడియాగా పేరున్న పత్రికలో వచ్చిన రాతలు గమనించండి.. ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి వ్యవహారశైలిపై అధికారులతోపాటు మంత్రులు, శాసనసభ్యులు కూడా విస్తుపోతున్నారట. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన ఉన్నతాధికారులు జగన్మోహన్‌ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తారని ఆశించి భంగపడుతున్నారట. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ప్రభుత్వంపై భారం ఎక్కువగా పడుతుందని చెప్పడానికి ప్రయత్నించిన ఉన్నతాధికారి ఒకరు జగన్మోహన్‌ రెడ్డి తీరు చూసి కంగుతిన్నారట.


నేను ప్రకటించాను.. అమలు జరగాల్సిందే! మిగతా విషయాలు మీరు చూసుకోండి’ అని ఆ అధికారితో ముఖ్యమంత్రి జగన్ చాలా కటువుగా చెప్పారట. దీంతో సదరు అధికారి ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి వద్దకు వెళ్లాడట. నా ప్రయత్నం నేను చేశా. మీరన్నా జోక్యంచేసుకుని నచ్చజెప్పండి‘ అని చెప్పాడట. అందుకు రాజేంద్రనాథ్ రెడ్డి కూడా.. అమ్మో నా వల్ల కాదు. ఆ తిప్పలేవో మీరే పడండి’ అని రాజేంద్రనాథ్‌ రెడ్డి తప్పించుకున్నారట. ఇది మచ్చుకు కొంత భాగం మాత్రమే.. ఇంకా రాస్తే చాలా ఉంది.. కానీ జనం ఈ రాతలను గమనిస్తారు..వాళ్లుకు తెలుసు ఎవరి రాతలు నమ్మాలో.. నమ్మకూడదో..


మరింత సమాచారం తెలుసుకోండి: