వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లలో తగ్గుదల చోటు చేసుకుంది. ఒక వస్తువుపై గతంలో రకరకాల పన్నులు విధించేవారు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను విధించేవారు. ఒక వస్తువు ఉత్పత్తి సమయంలో ఎక్సైజ్‌ సుంకం.. అదే వస్తువు మార్కెట్లోకి వచ్చేటపుడు ఆక్ర‌య్‌ పన్ను విక్రయ సమయంలో అమ్మకపు పన్ను విధించేవారు. ఇలా పన్ను మీద పన్ను వేయడం వల్ల వస్తు సేవలు పొందడం కష్టంగా ఉండేది. ఈ కారణంగా వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ పరిస్థితికి స్వస్తి పలికేందుకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విఽధానం జీఎస్టీ అమలుకు స్వీకారం చుట్టి రెండేళ్లయింది.
 
జీఎస్‌టీ వ‌సూళ్లు గ‌త నెల‌లో భారీగా త‌గ్గాయి. జులైలో రూ.1.02 ల‌క్ష‌ల కోట్లు వ‌సూలు కాగా, ఆగ‌స్టులో రూ.98.202కోట్ల‌కు ప‌రిమిత‌మ‌య్యాయి. ఇందులో కేంద్ర జీఎస్‌టీ రూ.17,733కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీ రూ.24,239కోట్లు, స‌మ్మిళిత జీఎస్‌టీరూ,48,598కోట్లు, సెస్‌రూ.7,23కోట్లు మేర ఉన్నాయ‌ని కేంద్ర ఆర్ధిక శాఖ వెల్ల‌డించింది. కాగా జూన్‌లో రూ.99,939కోట్లు వ‌సూళ్లు న‌మోద‌య్యాయి. తిరిగి మ‌ళ్ళీ ఆగ‌స్టు నెల‌లో జీఎస్టీ వ‌సూళ్లు త‌గ్గాయి. రూ.ల‌క్ష‌కోట్ల నుంచి రూ.98,202కోట్ల‌కు వ‌సూళ్లు ప‌డిపోయాయ‌ని కేంద్ర గ‌ణాంకాల్లో వెల్ల‌డైంది. ఇందులో సెంట్ర‌ల్ జీఎస్టీ రూ.17,733కోట్ఉల‌, స్టేట్ జీఎస్టీ రూ.24,239కోట్లు, ఉమ్మ‌డి జీఎస్టీ రూ.49,958 కోట్లుగా న‌మోద‌య్యాయ‌ని ప్ర‌భ‌/త‌్వ గ‌ణాంకాలు పేర్కొన్నాయి. మ‌రోవైపు జీఎస్టీ వ‌సూళ్లు రూ.ల‌క్ష కోట్ల దిగువ‌కు ప‌డిపోవ‌డంతో ఆర్ధిక‌మాంద్యానికి ఇది సంకేత‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.


 దీంతో పోల్చితే గత మాసం వసూళ్లలో పెరుగుదల ఉన్నట్లేనని అన్నారు. ఇ-వే బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన మెరుగైన ప్రదర్శనను ఇది ప్రతిబింబిస్తుందని ట్వీట్‌ చేశారు. మొత్తం వసూళ్లు పెరగడమేకాకుండా, రిటర్న్స్‌ సంఖ్య కూడా పెరిగిందన్నారు. మే 31 వరకు ఏప్రిల్‌ నెలలో దాఖలు చేసిన రిటర్న్స్‌ సంఖ్య 60.47 లక్షలతో పోలిస్తే 62.46కి పెరిగిందన్నారు. మార్చి నెల జీఎస్‌టి పరిహారం కింద మే 29న రాష్ట్రాలకు రూ.6696కోట్లు విడుదల చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: