కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఓ విద్యార్థినిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అంశంపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సదరు స్టూడెంట్.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి తగిన సాక్ష్యాధారాలు చూపించిందట.


ఆ సాక్ష్యాధారాల్లో చిన్మయానంద్ బెడ్ రూమ్ సీక్రెట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆరోపణలు చేసిన విద్యార్థిని సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి 43 వీడియోలతో ఓ ఓ పెన్ డ్రైవ్ ను సమర్పించిందట. దీంతో కేసు కొత్త మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది.


చిన్మయానంద్ లైంగిక దాడి చేశారనేందుకు ఉన్న సాక్ష్యాధారాలను సమర్పించాలని.. సిట్ బృందం ఇటీవల సదరు విద్యార్థిని కోరింది. దీంతో ఆ విద్యార్థిని పెన్ డ్రైవ్ ఇచ్చింది. దీంతో ఆ విద్యార్థినిని చిన్మయానంద్ ఇంటికి తీసుకెళ్లిన సిట్ బృందం ఆయన పడకగది నుంచి పలు ఆధారాలను సేకరించిందట.


చిన్మయానంద్ ఇంటిలోనే సదరు యువతిని పోలీసులు గంటల తరబడి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆరోపణలతో అక్కడి పరిస్థితులను సరిపోల్చుతూ విచారణ సాగిస్తున్నారు. చిన్మయానంద్ పడకగదిలోకి తీసుకెళ్లి మరీ విచారణ చేశారట. అయితే ఆ విద్యార్థిని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పిందట.


చిన్మయానంద్ పడకగది ఇంతకుముందులా లేదని సదరు యువతి గుర్తించింది . బెడ్ రూమ్ రంగులు మార్చేశాట. ఇంకా అనేక మార్పులు చేశారట. అంతే కాదు.. ఆ బెడ్ రూంలో ముఖ్యమైన ఆధారాలు కనిపించడం లేదని ఆ యువతి చెప్పిందట. సదరు యువతి చెప్పిన వివరాల ఆధారంగా విచారణ సాగుతోంది.


అయితే చిన్మయానంద్ మసాజ్ కు ఉపయోగించిన రెండు నూనెలు మాత్రం దొరికాయట. చిన్మయానంద ఉపయోగించి సబ్బు, టవల్ వంటి వస్తువులను ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. మరి ఈ కేసులో సాక్ష్యాలు ఎంతవరకూ సరిపోతాయి.. కేసు ఎంత పకడ్బందీగా ఉంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: