అంతర్జాతీయంగా మద్దతు లేకపోయినా.. కశ్మీర్ పై పాకిస్థాన్ కుట్రలు మానడం లేదు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జరిగే సమయంలో.. కశ్మీర్ లో కల్లోలం రేపాలనేది దాయాది వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు పీఓకే భారత్ దే నన్న విదేశాంగమంత్రి జైశంకర్ వ్యాఖ్యలపై పాక్ మండిపడింది. భారత్ ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతోందని ఆరోపించింది.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరుపై భారత దేశం ఇస్తున్న ప్రకటనలు రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని పాకిస్థాన్ ఆరోపించింది. ఇటువంటి వ్యాఖ్యల వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని హెచ్చరించింది. పీఓకే ఎప్పటికీ భారత్ దేనని, త్వరలోనే ఆ ప్రాంతంపై సార్వభౌమాధికారాన్ని కూడా సాధిస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్‌ను నిందిస్తూ.. అమాయక కశ్మీరీలపై పాల్పడుతున్న నేరాల నుంచి తప్పించుకోలేరని ఆరోపిస్తోంది పాకిస్తాన్.
భారత దేశ దూకుడును తీవ్రంగా పరిశీలించాలని అంతర్జాతీయ సమాజాన్ని పాకిస్థాన్ కోరింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను పెను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్థాన్ శాంతిని కోరుకుంటోందని, అయితే ఎటువంటి దురాక్రమణ చర్యపైన అయినా సమర్థంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి