తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడంటూ ఆయన అత్త నందమూరి లక్ష్మీపార్వతి పెట్టిన కేసు ఈ రోజు విచారణకు రానుంది. ఈ కేసును  హైదరాబాద్ లోని ఏసీబీ ప్రత్యేక న్యాయ స్థానం ఈ రోజు నుంచి విచారణ చేపడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో లక్ష్మీ పార్వతి తన వద్ద ఉన్న  ఆధారాలు కోర్టుకు సమర్పించాల్సిఉంటుంది. నిజానికి ఈ కేసు 2005 లో లక్ష్మీపార్వతి వేశారు.

 

ఇన్నాళ్లు స్టేలతో గడిపిన చంద్రబాబుకు ఇపుడు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఈ మధ్యనే  గట్టి షాక్ ఇచ్చింది. స్టే ఎత్తివేసూ ఈ కేసు ఈ నెల 25 నుంచి విచారణ చేపడుతున్నట్లుగా పేర్కొంది. దాంతో ఈ రోజు ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందన్న సంగతి ఆసక్తికరంగా మారింది.

 

ఇదిలా ఉండగా లక్ష్మీపార్వతి ఇపుడు వైసీపీలో ఉన్నారు. ఆమె తెలుగు అకాడమీ చైర్మన్ గా  ఉన్నారు. ఆమెకు ఈ కేసు విషయంలో వైసీపీ పెద్దల నుంచి పూర్తి అండదండలు ఉంటాయన్నది వేరేగా చెప్పనవసరం లేదు. బాబు అసలు ఆస్తులు ఎన్ని. ఆయన రెండు ఎకరాల నుంచి వచ్చి  ఇప్పటివరకూ సంపాదించిన ఆస్తులు ఎన్ని. వీటికి లెక్కలు ఎలా ఉన్నాయి. ఈ విషయాల మీద లక్ష్మీపార్వతి కేసు వేశారు.

 

కేసు వేసినపుడు లక్ష్మీపార్వతి ఒక్కరు అయినా ఇపుడు ఆమె ఉన్న పార్టీ అధికారంలో ఉంది. పైగా అటు జగన్, ఇటు లక్ష్మీ పార్వతి  ఇద్దరూ కూడా చంద్రబాబు బాధితులే. దాంతో కసి మీద పనిచేస్తే చంద్రబాబు ఎక్కడో ఒక చోట దొరుకుతారు అని అంటున్నారు. చంద్రబాబు మీద కనుక లక్ష్మీ పార్వతి  లీగల్ గా  విజయం సాధిస్తే మాత్రం ఆమె ప్రాధాన్యత వైసీపీలో అలా ఇలా ఉండదు. జగన్ సైతం ఆమెకు చాలా ప్రాధాన్యత కలిగిన పొజిషన్ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి బాబు మీద అత్త పెట్టిన గురి లక్ష్యాన్ని చేదిస్తుందని అంటున్నారు. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: