ప్ర‌స్తుతం స‌మాజం తీరు మారుతోంది. ఒక‌ప్పుడు బంధాల‌కు, అనుబంధాల‌కు ఎంతో విలువ ఉండేది. ఇప్పుడు అవి ఎవ్వ‌రికి ప‌ట్టడం లేదు. ఎంత గొప్ప వాళ్లు అయినా.. ఎంత నిగ్ర‌హంతో ఉండే వాళ్లు అయినా ఒక్కోసారి చాలా చీప్‌గా.... క్ష‌ణిక సుఖం కోసం దిగ‌జారిపోతున్నారు. పైకి ఎంత మంచిగా ఉంటున్నా... స‌మాజంలో హోదా ఉన్నా కూడా ఆ క్ష‌ణం సుఖం కోసం త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు. ఈ సంస్కృతి ఇటీవ‌ల బాగా పెరిగిపోతోంది.

 

ఇటీవ‌ల వివాహేతర సంబంధాలు సమాజంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. భర్త ఉండగానే పరాయి పురుషుడితో ఎఫైర్లు సాగించేవారి వ్యవహారాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి. ఇక భార్య ఉండ‌గానే ముగ్గురు, న‌లుగురు అమ్మాయిల‌తో శారీరక వాంచ‌లు తీర్చుకుంటోన్న పురుషులు కూడా ఉంటున్నాయి. అయితే వ‌య‌స్సు ప్ర‌భావంతో టీనేజ్‌లో ఇలాంటివి కామ‌న్‌. ఇవి బ‌య‌ట‌కు రావ‌డంతో ఎక్క‌డ ప‌రువు పోతుందో ? అన్న భ‌యంతో అటు భ‌ర్త‌ల‌ను చంపే భార్య‌లు... ఇటు భార్య‌ల‌ను చంపే భ‌ర్త‌లు ఎక్కువ అవుతున్నారు.

 

తాజాగా ఈ వివాహేతర సంబంధాలపై సర్వే చేసిన ఓ సంస్థ షాకింగ్ నివేదికను ఇచ్చింది. ఇన్ స్టిట్యూట్ ఫర్ ఫ్యామిలీ స్టడీస్ అనే అధ్యయన సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో టీనేజ్ వ‌య‌స్సులో ఉన్న వాళ్లు... యువ దంప‌తుల‌తో పోలిస్తే మ‌ధ్య వ‌య‌స్సులో ఉన్న వాళ్లు.. ఇంకా చెప్పాలంటే 32 సంవ‌త్స‌రాలు పై బ‌డిన వారే ఈ త‌ర‌హా అక్ర‌మ సంబంధాల‌కు ఆక‌ర్షితులు అవుతున్న‌ట్టు తేలింది.

 

అమెరికాలో వివాహేతర సంబంధాలు 35 ఏళ్లు పైబడిన జంటల్లోనే ఎక్కువగా ఉన్నాయని తేల్చింది. 35 ఏళ్లలోపు జంటల్లో వివాహేతర సంబంధాలు 14 శాతం ఉండగా.. ఇక 35 ఏళ్లపైబడిన జంట్లో 20శాతానికి పైగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నార‌ట‌. పెళ్ల‌య్యి రెండు ద‌శాబ్దాలు అయ్యాక భ‌ర్త అంటే భార్య‌కు బోర్ కొట్ట‌డం.. భార్య అంటే భ‌ర్త‌కు బోర్ కొట్ట‌డంతోనే వాళ్లు ప‌రాయి పురుషులు, స్త్రీల‌తో సెక్స్‌కు ఆక‌ర్షితులు అవుతున్నార‌ట‌.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: