చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. అయితే ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. అయితే వారిని కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. 

 

అయితే ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. అయితే ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు చేసుకున్నారు. 

 

కాగా ఈ ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని హైకోర్టులో మహిళా, పౌరహక్కుల సంఘాల నేతలు పిటిషన్ దాఖలు చెయ్యగా సోమవారం విచారణ జరిపిన కోర్టు మళ్ళి వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

 

ఎన్కౌంటర్ సంబంధించి పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్న న్యాయస్థానం.. ఢిల్లీ నుంచి రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారని.. దీనిపై తెలంగాణ రాష్ట్రం హై కోర్టు లో కేసు విచారణ కొనసాగుతుంది అని తెలిపింది. కాగా ఈ ఎన్కౌంటర్ కేసులో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ నిందితులు అని తెలిసాక వారిని ఎన్కౌంటర్ చెయ్యడంపై ఇంత విచారణ అవసరమా ? మీ విచారణ చూస్తుంటే రక్తం ఉడికిపోతుంది అంటూ నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: