తెలంగాణ లో రెండోసారి ముఖ్యమంత్రి .. కెసిఆర్ గారు విజయ బేరి మోగించి సత్తా చాటారు. ఇప్పుడు తెలంగాణ లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. నేడు లేక రేపు ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు....

 

రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలకు అంతా రెడీ చేసారు అధికారులు.. సంక్రాంతి తర్వాత పోలింగ్ ఉండే అవకాశం ఉంది. పోతే వచ్చే ఏడాది జనవరిలో పోలింగ్ ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరగడంతోపాటు అధికారులకు కూడా సమాచారం ఉండడంతో మున్సిపల్‌ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఎన్నికల ఏర్పాట్లలో కీలక ఘట్టమైన వార్డుల విభజన పూర్తి కాగా, ఈ మేరకు ఆయా మున్సిపాలిటీలకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ  చేసారు.. మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. పురపోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఎన్నికలకు త్వరలోనే నగారా మోగించేందుకు సిద్ధమవుతున్న ఈసీ.. మంగళవారం మున్సిపల్‌ కమిషనర్లతో సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది.

 

ఈ మేరకు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసింది... మొత్తం 3179 వార్డులకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తేల్చి చెప్పారు..ఎన్నికలకు వార్డులను రెడీ చేయాలనీ సూచించారు.. తెల్ల బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు..

 

ఒకే ఒక పేజీలో ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుంది. ఈరోజు సాయంత్రం లోగా ఎన్నికల విషయం పై ఒక క్లారిటీ అనేది వస్తుంది.. ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు వాళ్ళ వోటుని వినియోగించుకుని, వాళ్ళ కి నచ్చిన నాయకుడికి వోట్ వేయవచ్చు... ఎన్నికల సంఘం నియోజకవర్గాల వారీగా ఆయా మున్సిపాలిటీలకు ఓటర్ల జాబితాను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఎస్‌ఈసీ నుంచి ఆయా మున్సిపాలిటీలకు ఓటరు జాబితా త్వరలో అందిన వెంటనే బల్దియాకు అధికారులు వార్డుల వారీగా ఓటర్లను విభజన చేస్తారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: