చైనాలోని ఊహన్  నగరంలో వ్యాపించిన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను మరణ భయంతో వణికిస్తోంది. చైనా దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందిన ఈ ప్రాణాంతకమైన వైరస్  ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రాణాంతకమైన  వైఎస్ కు  సరైన విరుగుడు కూడా లేకపోవడంతో... చైనా వాసులందరూ పిట్టలు రాలి పోయినట్లుగా కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి పదిహేను వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 65 వేల మందికి పైగా వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. రోజురోజుకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. 

 


 కాగా  ఈ కరోనా  వైరస్ అటు ప్రపంచ దేశాలను కూడా బెంబేలెత్తిస్తున్నది . దీంతో ఇప్పటికే వివిధ దేశాల నుంచి చైనా దేశానికి విమాన సర్వీసులు సహా పలు రవాణా సౌకర్యాలు కూడా రద్దయ్యాయి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అన్ని దేశాల ప్రభుత్వాలు చైనా కు సంబంధించిన అన్ని సర్వీసులు రద్దు చేసుకున్నారు ఈ నేపథ్యంలో చైనాలోని పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతుంది. ఈ మహమ్మారి కరోనా  వైరస్ కారణంగా చైనాలో భారీ ప్రాణ నష్టమె  కాదు... ఆర్థికంగా కూడా చైనా దేశం భారీగానే నష్టపోతుంది. ఈ మహమ్మారి వైరస్ పుణ్యమా అని వ్యాపార ఆర్థిక రంగాలు తీవ్ర ప్రభావానికి గురయ్యయి . 

 

 ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన కంపెనీలు చైనాలో మూతపడ్డాయి. దాదాపుగా అన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను చైనాకు నిలిపివేశాయి . అటు చైనా కు వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య మరింత పడిపోయే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక రంగ మొత్తం అతలాకుతలమవుతోంది. మరోవైపు ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తుంది. చైనా లోని పలు కంపెనీలు జాగ్రత్త చర్యలు చేపడుతోన్నాయి.  ఇప్పుడిప్పుడే సాధారణస్థితికి వస్తున్నాయి. తమ కంపెనీలో ఉద్యోగం చేసే వారికోసం ఒక కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. చాంగ్ కింగ్ లో ఓ కంపెనీ   విధులకు హాజరవుతున్న ఉద్యోగులపై ఆంటీ వైరస్ మందులను పిచికారి చేసి వారిని విధుల్లోకి  అనుమతిస్తుంది. దీని కోసం ఏకంగా రెండు సొరంగాలను కూడా ఏర్పాటు చేసింది ఆ కంపెనీ.

మరింత సమాచారం తెలుసుకోండి: