ఈ మధ్యకాలంలో టిక్టాక్ ఎంతో మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది అనే విషయం తెలిసిందే. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తుంది టిక్ టాక్. ఎంతోమంది 24 గంటలు ఇన్ టిక్ టాక్ లోనే గడిపేస్తున్నారు. పక్కన ఉన్న మనుషులను సైతం పట్టించుకోవడం లేదు. ఈ మధ్య కాలంలో ఆస్పత్రిలో కూడా టిక్ టాక్ ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఎంతోమంది ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది టిక్టాక్ చేయడం ద్వారా సస్పెన్షన్ కు  కూడా గురయ్యారు. విధులను పక్కనపెట్టి టిక్ టాక్  వీడియోలు చేసీ ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు చాలామంది. అంతే కాకుండా టిక్ టాక్ ఎన్నో కాపురాల్లో చిచ్చు పెట్టి భార్యాభర్తలను విడగొడుతుంది కూడా. 

 


 అయితే తాజాగా ఓ హాస్పిటల్లో వైద్యుడు  చేసిన టిక్ టాక్ వీడియో సంచలనం గా మారిపోయింది. టిక్టాక్ సంచలనం ఏమిటి అంటారా... ఆ వైద్యుడు ఆపరేషన్ చేస్తున్న సమయంలో టిక్ టాక్ వీడియో ని చేశాడు. ఆపరేషన్ థియేటర్లు రోగికి శస్త్ర చికిత్స చేస్తూ ఇతర సిబ్బందితో డాక్టర్ టిక్ టాక్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే శ్రీకాంత్ అనే వైద్యుడు... ఓ వ్యక్తికి శాస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో టిక్ టాక్  చేశాడు అనే  ఓ వార్త హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికులు దీనిపై  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 అయితే ఈ వార్తలపై హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ  డాక్టర్ శ్రీకాంత్ వివరణ ఇచ్చారు. టిక్ టాక్ వీడియో చేయలేదు అంటూ ఆయన తెలిపారు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న టిక్ టాక్ వీడియో తో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ డాక్టర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఆపరేషన్ చేయడానికి ముందు తీసిన వీడియో గా భావిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు. అయితే ఆ వీడియోను కావాలని ఎవరో  టిక్ టాక్ లో పెట్టారు అంటూ చెబుతున్నారు ఆయన. ఏదేమైనా ఆసుపత్రిలో ఉన్నప్పుడు రోగులకు చికిత్స చేయాలి కానీ టిక్ టాక్  వీడియోలు చేయడం ఏమిటి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: