అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన కొనసాగుతోంది. మోతెరా స్టేడియంలో ట్రంప్ దంపతులతో పాటు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఇతరులు పాల్గొన్నారు. మోతెరా స్టేడియం లక్షల సంఖ్యలో హాజరైన జనాలతో కిక్కిరిసిపోయింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని బలమైన మైత్రి బంధం - ఉజ్వల భవిష్యత్ అనే నినాదంతో ప్రారంభించారు. 
 
మోదీ నమస్తే ట్రంప్ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ట్రంప్ సాక్షిగా మోదీ ఇండియా యూఎస్ ఫ్రెండ్ షిప్ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. నా మిత్రుడు ట్రంప్ సుదూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలోకి ట్రంప్ కు సుస్వాగతం అని అన్నారు. ట్రంప్ కు గుజరాత్ భూమి స్వాగతం పలికిందని కానీ ఆ ఉత్సాహం మాత్రం భారతదేశానిదేనని అన్నారు. 
 
ఒక కొత్త చరిత్రతో మోతెరా క్రికెట్ స్టేడియం ప్రారంభమైందని మోదీ అన్నారు. ట్రంప్, ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అమెరికా కూడా భారతదేశంతో బలమైన సంబంధాలను కోరుకుంటోందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ అమెరికాను కలుపుతుందని మోదీ అన్నారు. గతం కంటే భారత్ అమెరికా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ట్రంప్ కుటుంబసమేతంగా భారత్ కు విచ్చేయడం భారత్ కు ట్రంప్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతోందని అన్నారు. ట్రంప్ చారిత్రాత్మక భారత పర్యటనను అమెరికా నుండి ప్రారంభించారని మోదీ అన్నారు. అహ్మదాబాద్ నగరం ప్రాచీన నాగరికతకు పేరుగాంచిందని చెప్పారు. ఈ ప్రాంతానిది స్వాతంత్ర్య పోరాటంలో కీలక భూమిక అని వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు హాజరయ్యారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: