ఏపీ సీఎం జగన్.. తాను అనుకున్నదే చేసే రకం అని అందరికీ తెలుసు. తాను ఒక నిర్ణయం తీసుకుంటే పర్యవసానాల గురించి పెద్దగా ఆలోచించే రకం కాదు. దాని ఫలితం ఎలా ఉన్నా సరే.. ముందుకే వెళ‌తాననే మనస్తత్వం. ఇది ఒక్కోసారి మేలు చేస్తుంది. మరోసారి దెబ్బ కొడుతుంది. అయినా సరే నేనింతే అనే తత్వం జగన్ ది.

 

 

ఈ విషయం మరోసారి రుజువైంది. దేశంలోనే అతి పెద్ద ధనవంతుడైన, పలుకుబడి ఉన్న ముకేశ్ అంబానీ స్వయంగా ఇంటికి వచ్చి మరీ అడిగినా సరే.. జగన్ పట్టించుకోలేదు.. మా వాడి మీ పార్టీ నుంచి రాజ్యసభ సీటివ్వు బాసూ అని అడిగినా పెద్దగా పట్టించుకోలేదా.. ఇది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిళ్లో వినిపిస్తున్న ప్రచారం. రెండు రోజుల కిందట రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబానీ తన కొడుకు మరియు రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీతో కలిసి అమరావతికి వచ్చిన సంగతి తెలిసిందే.

 

 

ముకేశ్ అంబానీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డితో భేటీ కావడం ఇదే ఫస్ట్ టైమ్.. తనకు కావాల్సిన వ్యక్తి పరిమల్ నత్వానీని ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా పంపాలని ముకేశ్ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అందులోనూ ఏపీలో రిలయన్స్ సంస్థ కొన్ని పరిశ్రమలు పెట్టాలనుకుంటోంది. ముకేశ్ అంబానీ నెట్ వర్క్ మామూలుది కాదు.. ఆయనకు బీజేపీ పెద్దలతోనే మంచి సంబంధాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా సరే.. ముకేశ్ కోరికకను జగన్ సున్నితంగా తిరస్కరించినట్టు వార్తలు వస్తున్నాయి.

 

 

ఇప్పటివరకూ బయటివారికి రాజ్యసభ సీటు ఇచ్చే సంప్రదాయం తమ పార్టీలో లేదని జగన్ ముకేశ్ అంబానీతో తేల్చిచెప్పేసారట. స్వయంగా అంబానీయే వచ్చి అడిగినా జగన్ నో చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. చర్చకు దారి తీస్తోంది. కొన్నిసార్లు నో చెప్పడం కూడా సాహసమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: