ఏ విషయాన్నైనా సూటిగా సుత్తి లేకుండా చెప్పడం... తాను చెప్పింది వెనక్కి తిరిగి చూడకుండా చేసుకుని వెళ్లిపోవడం జగన్ స్టైల్. మొదటి నుంచి జగన్ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. తనను నమ్ముకున్న వారికి తాను నమ్మిన వారికి ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకుంటారు జగన్ కానీ ఓ విషయంలో మాత్రం జగన్ ఏం చేయబోతున్నారు అనేది అందరికీ ఆసక్తి గా మారింది. ముఖ్యంగా రాజ్యసభ స్థానాల విషయంలో పార్టీలోని దాదాపు 10 మంది వరకు తీవ్రంగా పోటీ పడుతున్నారు ఎవరికి ఇంకెవరు బాధపడతారని ఉద్దేశంతో జగన్ ఈ వ్యవహారాన్ని ఇంకా తేల్చలేదు' 


ఇదిలా ఉండగానే కొద్ది రోజుల క్రితం జగన్ ను రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ కలిశారు. అయితే వారి వ్యాపార వ్యవహారాలు సంబంధించి ఏపీలో రిలయన్స్ పెట్టుబడుల గురించి వీరు భేటీ అయ్యారని ప్రచారం జరిగినా రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రముఖుడైన పరిమళ్ నత్వానీకి ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకునేందుకు  ఆయన జగన్ దగ్గరికి వచ్చినట్లు ఆ తరువాత అందరికీ క్లారిటీ వచ్చింది. ముకేశ్ అంబానీ నేరుగా జగన్ ఇంటికి వచ్చి రాజ్యసభ ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు జగన్ నిర్మొహమాటంగా తన మనసులో మాట చెప్పి ఉంటే ఆ వ్యవహారం అక్కడితో పోయి ఉండేది. కానీ జగన్ మొహమాటం కొద్దీ వారిని మూడు రోజుల సమయం అడగడంతో జగన్ బెండయ్యారనే  వార్తలు కూడా వస్తున్నాయి.

 

IHG


 ఇదే విషయమై పరిమళ్ నత్వానీకి కూడా బహిరంగంగానే తన స్పందనను తెలియజేశారు. జగన్ ను తాను  రాజ్యసభ సభ్యత్వం అడిగిన మాట వాస్తవమేనని పరిమళ్ నత్వానీ చెబుతున్నారు. అయితే దానికి జగన్ సమాధానమిస్తూ,బయటి వారికి పదవులు ఇచ్చే సాంప్రదాయం తమ వద్ద లేదని చెప్పారని, అదే సమయంలో మూడు రోజుల సమయం అడిగారని పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పారట. ఒకవేళ ముకేశ్ అంబానీ ఒత్తిడి మేరకు జగన్ ఏపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తే ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 


పోనీ పరిమళ్ నత్వానీ జగన్ కు ఏమైనా స్నేహితుడా  అంటే అది కాదు. దీంతో జగన్ నమ్ముకున్నవారికి కాకుండా బయట వారికి  రాజ్యసభ సభ్యత్వం దక్కితే జగన్ పై వారు విమర్శలు చేసే అవకాశం కూడా లేకపోలేదు. జగన్ పై ఉన్న కేసులు భయంతో బిజెపి ఒత్తిడి మేరకు పరిమళ తత్వానికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని ప్రతిపక్షాలు ప్రచారం చేసే అవకాశం కూడా ఉండడంతో జగన్ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఏమైనా ముకేశ్ అంబానీ మాత్రం నేరుగా జగన్ ఇంటికి వచ్చి తన స్నేహితుడికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని అడిగి జగన్ ను ఇరకాటంలోకి నెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: