అత్యాచారం చేసి బాధితురాలి శరీరంలోకి ఐరన్ రాడ్‌ కూడా దించాడంటే...వాడు ఎంతటి క్రూరుడై ఉండాలి..! నిర్భయపై అత్యాచారం జరిగిన సమయంలో క్రూరంగా, కిరాతకంగా వ్యవహరించాడు ముఖేష్ సింగ్. తాను బస్సు నడిపానని...నిర్భయపై జరిగిన దాడితో సంబంధం లేదని వాదించినా... ఉరి నుంచి తప్పించుకోలేకపోయాడు.

 

ఉపాధి వెతుక్కుంటూ రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఢిల్లీలో స్థిరపడింది ముఖేష్ సింగ్ కుటుంబం. నిర్భయ కేసులో ప్రధాన నిందితుడు రామ్‌ సింగ్‌కు ముఖేష్ సోదరుడు. రామ్ సింగ్‌తో కలిసి  ఢిల్లీ రవిదాస్ మురికివాడల్లో ఉండేవాడు ముఖేష్... నిర్భయ ఘటన జరిగినప్పుడు ఇతని వయస్సు 26 యేళ్లు. నిర్భయ బస్సులోకి ఎక్కినప్పుడు తన స్నేహితులను అత్యాచారానికి పురిగొల్పాడు ముఖేష్. 

 

డ్రైవర్‌గా, క్లీనర్ గా పనిచేసే ముఖేష్ సింగ్... అత్యాచారం జరిగిన రోజు బస్సు నడిపాడు. తాను డ్రైవింగ్ సీట్‌లో ఉన్నానని... తనకు అత్యాచారానికి ఎటువంటి సంబంధం లేదని ముఖేష్ వాదించాడు. తన సోదరుడు రామ్‌సింగ్‌తో పాటు మిగతా నలుగురు అత్యాచారం చేశాడని కోర్టుకు తెలిపాడు. అయితే న్యాయస్థానం ఇతని వాదనను తిరస్కరించింది. నిర్భయపై జరిగిన అత్యాచారంలో అందరి పాత్ర ఉందని స్పష్టం చేసింది. ఎవరు  ఏ స్థాయి నేరం చేశారనే దాని కంటే... ఉమ్మడిగా అందరూ దోషులేనని స్పష్టం చేసింది.

 

నిర్భయపై అత్యాచారం జరిగిన తర్వాత ముఖేష్ సింగ్ రాక్షసుడిలా ప్రవర్తించాడు. బాధితురాలి శరీరంలోకి ఐరన్ రాడ్‌ను దించాడు... నిర్భయ శరీరంలో నుంచి కొన్ని అవయవాలు బయటకు వచ్చే స్థాయిలో అత్యంత క్రూరంగా హింసించాడు. అత్యాచారం తర్వాత కూడా నిర్భయ నరకం చూడడానికి కారకుడు ముఖేష్ సింగ్.

 

నిర్భయ కేసు నుంచి బయట పడేందుకు ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేష్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
ఉరి శిక్ష పడిని నలుగురు దోషుల్లో క్షమాభిక్ష ప్రసాదించాలంటూ  రాష్ట్రపతి ముందు పిటిషన్ దాఖలు చేసిన మొదటి వాడు ముఖేష్ సింగ్.. అయితే అప్లికేషన్ పెట్టుకున్న నాలుగు రోజుల్లోనే ముఖేష్ సింగ్ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు.

 

జైల్లో తనపై అత్యాచారం జరిగిందంటూ సంచలన  ఆరోపణలు చేశాడు ముఖేష్ సింగ్. కోర్టులు కేవలం తనకు ఉరిశిక్ష అమలు చేయమని మాత్రమే సూచించాయని...కానీ తనపై లైంగిక దాడి జరిపేందుకే జైలుకు పంపారా అంటూ సుప్రీం కోర్టులో వాదించాడు ముఖేష్.  జైలు అధికారులు తనను శారీరకంగా వేధించారని ఆరోపణలు చేశాడు. రాష్ట్రపతి వద్దకు పంపిన క్షమాభిక్ష పిటిషన్‌లో వాస్తవాలు వెల్లడించలేదని ఆరోపణలు చేశాడు. అయితే న్యాయస్థానం ముఖేష్ వాదనలను తోసిపుచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: