కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వైరస్ 3,00,000 మందికి సోకగా 13,000 మందికి పైగా మృతి చెందారు. భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 324కు చేరింది. దేశంలో కరోనా దెబ్బకు రోడ్లన్నీ నిర్మానుష్యం అవుతున్నాయి. ప్రజలు ఎక్కువగా ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావడం లేదు. 
 
మొదట్లో చైనాను ఈ వైరస్ అతలాకుతలం చేయగా ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలు కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి. ఇటలీలో మృతుల సంఖ్య 5 వేలకు చేరువలో ఉంది. కరోనాకు మందు కనిపెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో శాస్త్రవేత్తలు కనిపెట్టిన వ్యాక్సిన్ ను ఇటీవలే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 
 
తాజాగా ఒక ఫ్రెంచ్ పరిశోధకుడు కరోనాను పూర్తిగా నయం చేయడానికి ఒక కొత్త చికిత్సా విధానాన్ని కనిపెట్టాడు. శాస్త్రవేత్త చేసిన పరిశోధనల్లో ఔషధం ఆరు రోజుల్లో కరోనాను పూర్తిగా తగ్గిస్తుందని తేలింది. ప్రొఫెసర్ డిడిర్ రావౌల్ట్ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంపై ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఫ్రెంచ్ ప్రభుత్వం కరోనా చికిత్సకు సంబంధించిన పూర్తి బాధ్యతలను అతనికి అప్పగించింది. 
 
మరోవైపు క్లోరోక్విన్ కరోనాను పూర్తిగా తగ్గిస్తుందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ లో క్లోరోక్విన్ ఫాస్పేట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. చైనాలోని కరోనా బాధిత రోగులకు ఎక్కువగా క్లోరోక్విన్ ఫాస్ఫేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్‌‌లను చికిత్స కొరకు వినియోగించారు. తెలంగాణలో ఇప్పటివరకూ 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.                        

మరింత సమాచారం తెలుసుకోండి: