భజన కు కూడా ఓ హద్దు పొద్దు ఉండాలి కానీ ఇవేవీ పట్టనట్లు తెలుగు తమ్ముళ్ళు డైలాగులు చూస్తే అర్థం అయిపోతుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. ప్రస్తుతం దీనికి ఎటువంటి మందులు అందుబాటులో లేవు. కేవలం ఒకరి నుంచి ఒకరికి సోకకుండా అడ్డుకట్ట వేయడమే ప్రభుత్వాల ప్రధాన విధిగా మారింది. అయితే ఈ విషయం తెలుగు తమ్ముళ్లు ఇంకా గ్రహించినట్టుగా కనిపించడం లేదు. ఏపీలో జగన్ ప్రభుత్వం అసలు పని చేయడమే లేదని, కరోనా వైరస్ నిరోధించేందుకు ఆయన చర్యలు తీసుకోవడం లేదని, అసలు ఏపీకి కరోనా వైరస్ రావడానికి ప్రధాన కారకుడు జగనే అన్నట్లుగా తెలుగు తమ్ముళ్లు భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే దీనికి ప్రస్తుతానికి ఎటువంటి మందులు లేవు. కేవలం ప్రజల స్వీయ నియంత్రణ, గుంపులుగా తిరుగుతూ ఉండడం, ప్రస్తుతానికి ఇవే పరిష్కార మార్గాలు. 

 


ఈ విషయం తెలుగు తమ్ముళ్లకు ఇంకా బోధపడినట్టుగా కనిపించడం లేదు. ప్రజలను కరోనా వైరస్ కారణంగా ఎటువంటి దుష్ఫలితాలు వస్తాయి అనే విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయకుండా, రొటీన్ గా జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయడంతో టీడీపీ నాయకులు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. వీరి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే అర్జెంటుగా జగన్ ను సీఎం పీఠం నుంచి దించేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి అన్నట్లుగా తెలుగు తమ్ముళ్ల స్టేట్మెంట్లు ఉంటున్నాయి. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి జగన్ ఏం చదువుకున్నాడు ? ఇంటర్ పాస్ అయ్యాడా లేదా ? అనే అసంబద్ధమైన విమర్శలను చేస్తూ, డైలాగులు పేల్చుతున్నారు.

 

 ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పారాసెట్మాల్ టాబ్లెట్స్ వేసుకోమని జగన్ చెబుతున్నారని, ఆయన ఏమన్నా డాక్టరా అంటూ విమర్శలు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఒక్కక్షణం కూడా జగన్ సీఎం కుర్చీలో కూర్చునేందుకు అర్హుడు కాదని, వెంటనే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ కూనా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేయడం... దీనికి కరోనా కారణంగా చూపించడంపై జగన్ ఆయన మంత్రి వర్గ సహచరులు ఎన్నికల కమిషనర్ ను డిమాండ్ చేశారని, కాబట్టి వీరందరూ అర్జెంటుగా రాజీనామా చేసి తీరాలని పట్టుబడుతున్నారు.

 


 అక్కడితో ఆగకుండా ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపైన తెలుగు తమ్ముళ్లు అవినీతి విమర్శలు చేశారు. ముఖ్యంగా శానిటేషన్ పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, వాటి పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని, పెద్ద ఎత్తున విమర్శలు, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని విధాలుగా జగన్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి చంద్రబాబు వంటి సమర్ధుడు మాత్రమే కరోనా వైరస్ నుంచి కాపాడగలరు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంతటి విపత్తు సమయంలో తెలుగు తమ్ముళ్లు రాజకీయాలకు అతీతంగా ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి యధావిధిగా ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ప్రజలు కూడా పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. ఈ సమయంలో మీకు రాజకీయాలు కావాల్సి వచ్చిందా అంటూ జనాలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: