దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారిలో 441 మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశంలో కరోనా వైరస్ మరో దశలోకి ప్రవేశించినట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలో నిన్న ఒక్కరోజే 300 కేసులకు పైగా నిర్ధారణ అయ్యాయి. వీరిలో మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారే ఎక్కువగా ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనా భారీన పడి 45 మంది ప్రాణాలు కోల్పోగా 150 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 
 
మరోవైపు కరోనా దెబ్బకు భారత్ ఆర్థికంగా కుదేలవుతోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూ ఉండటంతో ప్రధాని మోదీ లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మోదీ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. కరోనా ప్రభావంతో కేంద్రం 4.88 లక్షల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి కరోనాతో సంభవించే విపత్తును ఎదుర్కొనేందుకు అప్పు తీసుకోనున్నట్లు తెలిపారు. 2020 - 2021 తొలి త్రైమాసికంలో 4.88 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం అప్పుగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆర్థిక సంవత్సరంలో 7.8 లక్షల కోట్ల రూపాయలు స్థూల రుణాలుగా ఉంటాయని బడ్జెట్ సమావేశాల సమయంలో ప్రకటన చేశారు. 
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండటం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిన్న ఒక్కరోజే 300 కేసులకు పైగా నమోదు కావడంతో దేశంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 58కు చేరగా తెలంగాణలో 97కు చేరింది. దేశంలో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 302 కేసులు నమోదు కాగా కేరళలో 241 కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: