గత మూడు రోజుల నుంచి దేశంలో ఎక్కడ చూసినా నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల గురించే చర్చ జరుగుతోంది. కరోనా కేసులు పెరగడానికి కారణమైన మత ప్రార్థనలకు నేతృత్వం వహించిన మర్కజ్ మసీద్ చీఫ్ మౌలానా సాద్ గురించే విపరీతంగా చర్చ జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసిన మరు నిమిషం నుంచి ఆయన పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 
 
ఢిల్లీ పోలీసులు మౌలానా కోసం గాలింపు చర్యలు చేపట్టిన సమయంలో ఆయన కొన్ని ఆడియో టేప్ లను విడుదల చేస్తున్నారు. మొదట తాను స్వీయ నిర్భంధంలో ఉన్నానని కరోనాకు చికిత్స తీసుకుంటున్నానని ఆయన ఆడియో టేప్ విడుదల చేశారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా 70 వేల మంది చనిపోయారని... నిజానికి వారంతా దేవ దూతలుగా మారారని.. మిమ్మల్ని ఏ డాక్టరైనా రక్షించగలడా...? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
మౌలానా సాద్ చెప్పినట్లుగా వైరల్ అయిన ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. గత నెల మార్చి 14, 15 తేదీలలో ఢిల్లీలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల వల దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే మర్కజ్ మసీద్ ప్రతినిధులు మాత్రం తాము నిబంధనలను పాటించామని.... చట్ట విరుద్ధంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. 
 
మరో ఆడియో టేప్ లో ముస్లింలు కలిసి భోజనం చేయకుండా కుట్రలు జరుగుతున్నాయని... కరోనా లక్షణాలు కనిపించినా భయాందోళనకు గురి కావొద్దని.. సామూహిక ప్రార్థనలు మునుపటి కంటే బలంగా చేయాలని మౌలానా సాద్ చెప్పారు. జాతీయ మీడియా ఛానెళ్లు కూడా ఈ ఆడియో టేప్ ను ప్రసారం చేశాయి. ఆడియో టేపులు వెలుగులోకి రావడంతో మత ప్రార్థనల వెనుక కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్కజ్ ఉదంతంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 132కు చేరగా తెలంగాణలో 127 కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: