దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 149 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో పిల్లుల నుంచి మనుషులకు కరోనా సంక్రమిస్తుందని తేలింది. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నప్పటికీ పిల్లి నుంచి మనుషులకు కరోనా సోకుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
కొన్ని రోజుల క్రితం బెల్జియంలో ఒక పిల్లికి దాని యజమాని నుంచి కరోనా సోకింది. శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో పిల్లి నుంచి పిల్లికి కరోనా సోకే అవకాశాలు ఉన్నట్టు తేలింది. పిల్లి నుంచి మనుషులకు కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పిల్లుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందో లేదో అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఫలితాలు వచ్చే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. 
 
పిల్లులకు కరోనా సోకుతున్నట్లు నిర్దారణ అయినా కోళ్లు, పందులు, కుక్కలకు కరోనా సోకుతున్నట్లు నిర్ధారణ కాలేదని చెప్పారు. మరోవైపు చైనాలో పిల్లి మాంసం, కుక్క మాంసం పూర్తిగా నిషేధించడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని షెన్ జేన్ నగరంలో కుక్క, పిల్లి మాంసంపై పూర్తిగా నిషేధం విధించగా మిగిలిన అన్ని నగరాల్లోను ఈ రెండు జంతువుల మాంసాన్ని నిషేధించే అవకాశం ఉందని సమాచారం. 
 
షెన్ జేన్ నగరంలో మాంసం విక్రయించేవారు కుక్కలు, పిల్లులు మనుషులకు అత్యంత సన్నిహితంగా ఉంటాయని... ఆ రెండు జంతువులను తినడం మానవత్వం కాదనే ఉద్దేశంతో నిషేధించామని చెబుతున్నారు. కానీ కరోనా వల్లే ఈ రెండు జంతువుల మాంసంపై నిషేధం విధించారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2543కు చేరింది. వీరిలో 191 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: