ప్రపంచవ్యాప్తంగా కరోనా  ఎఫెక్ట్ కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రభావం కేవలం మనిషి పైన కాదు ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పెరిగిపోతోంది. కొన్ని కొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టాల బాటలో నడుస్తూ కష్టాల ఊబిలోకి కూరుకుపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో  స్టాక్ మార్కెట్లతో పాటు ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు అందరూ భారీ మొత్తంలో సంపదను కోల్పోతున్నారు. క్షణాల్లోనే బిలియనీర్ల సంపద ఆవిరైపోతుంది. చాలా మటుకు బిలియనీర్ల సంపద కోల్పోతుంటే చైనాకు చెందిన తొమ్మిది మంది ప మాత్రం... గడిచిన రెండు నెలల్లో తమ సంపదను పెంచుకోవడం గమనార్హం. 

 

 

 హురున్  రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏప్రిల్ 6వ తేదీన విడుదల చేసిన తాజా రిపోర్ట్  లో ఈ విషయం వెల్లడైంది.  నివేదిక ప్రకారం టాప్ 100 బిలియనీర్ల జాబితాలో చైనా నుంచి కొత్తగా 9 కోటీశ్వరులు వచ్చి ఈ జాబితాలో చేరారు. ఇక భారత్ నుంచి ముగ్గురు అమెరికా నుంచి ఇద్దరు ఈ జాబితాలో చోటు కోల్పోవడం గమనార్హం. ఇక ప్రపంచంలోనే మొదటి వరుసలో ఉండే సంపన్నులు. గౌతమ్ అదానీ  37% సంపద కోల్పోయారు... శివ నాడార్  కూడా కరోనా  వైరస్  ప్రభావం కారణంగా 26%... ఉదయ్ కొటక్  28 శాతం సంపదను కోల్పోయారు. భారత సంపన్నుడు ముఖేశ్ అంబానీ ఏకంగా 1.44 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూశారు. ఇక ఈ జాబితాలో 17వ స్థానానికి పడిపోయాడు. 

 

 

 వందలో కేవలం తొమ్మిది శాతం మంచి సంపద మాత్రమే... మిగతా 86 శాతం మంది సంపద ఆవిరైపోయింది. ఇంకా మిగతా ఐదు శాతం మంది సంపద పెరగడం తగ్గడం జరగకుండా ఎలాంటి మార్పు లేకుండా ఉంది. అయితే గత రెండున్నరేళ్ళలో బిలియనీర్లు సృష్టించిన సంపద మొత్తం కేవలం కరోనా  ప్రభావం కారణంగా రెండు నెలల్లోనే ఆవిరైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ బిలియనీర్ల సంపద ఎంతగానో ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్ భారీగా పతనం కావడమే దీనికి కారణం అన్నట్లు తెలుస్తోంది. రోజుకో నష్టాల్లో కూరుకుపోతున్న స్టాక్ మార్కెట్ల ద్వారా వేల కోట్ల సంపద ఆవిరైపోతుంది. మార్చి 31 వరకు కేవలం తొమ్మిది మంది బిజినెస్ సంపద మాత్రం పెరిగింది. అయితే వీరంతా చైనాకు చెందిన వారే కావడం గమనార్హం. ఇందులో ఫోర్క్ ఉత్పత్తిదారు కింద యాంగ్లిన్  కియాన్ ఇంగ్లిన్ , ఆయన భార్య లియు ఇంగ్లిన్  మిలియన్ డాలర్లు పెరిగి 22 బిలియన్ డాలర్లకు చేరింది. అంతేకాకుండా న్యూ హోప్ గ్రూప్కు చెందిన లియు యాంగ్ హొ కు చెందిన  సంపద 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. వెంటిలేటర్  లైఫ్ సపోర్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఒక్కసారిగా డిమాండు పెరిగిపోవడంతో... మెన్ డ్రే సంస్థకు అలెక్స్ జు హంగ్  సంపద 25 శాతం లేదా 2.9 బిలియన్ డాలర్లకు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: