దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో కరోనాను కట్టడి చేయడానికి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరికొన్ని నిర్ణయాల అమలు దిశగా చర్యలు చేపడుతోంది. మరి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై భారతీయులు ఏమనుకుంటున్నారని ఒక సర్వే చేయగా ఆ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
లండన్ కు చెందిన ఒక సంస్థ ప్రపంచ దేశాల పరిస్థితులన్నింటినీ సర్వే చేయగా ప్రపంచమే ఆశ్చర్యపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సర్వేలో మన దేశ ప్రజలు కరోనా కట్టడి విషయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. దేశంలో దాదాపు 82 శాతం మంది ప్రజలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారు. దేశంలో 86 శాతం మంది ప్రజలు భవిష్యత్తు పట్ల ఆందోళన చెందుతున్నా కేంద్రం కరోనాను కట్టడి చేస్తుందని బలంగా నమ్ముతున్నారు. 
 
లండన్ కు చెందిన ప్రముఖ సంస్థ సిటీ గ్లోబల్ ఇన్ సైడ్ ట్రాకర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారు. భారత్, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్ దేశాలలో రెండు దశల్లో మార్చి 23 - 26 తేదీలలో మరియు ఏప్రిల్ 2 - 5 మధ్య భారత్ ప్రజలు ఇతర దేశాలతో పోలిస్తే కరోనా కట్టడి కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తున్నారని తేలింది. కేంద్రం లాక్ డౌన్ అమలు చేసి బాధితుల సంఖ్య, కేసుల సంఖ్య తగ్గించడంలో సక్సెస్ అయిందని అభిప్రాయపడుతున్నారు. 
 
కేంద్రం కరోనా కట్టడి విషయంలో సమర్థవంతంగా కృషి చేస్తుందని తెలిపారు. ఇతర దేశాల్లో 70 శాతం కంటే తక్కువగా ప్రజలు ఆయా దేశాల నిర్ణయాలను విశ్వసిస్తున్నారు. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలను ప్రజలు సమర్థించడం లేదు. కరోనా కట్టడి విషయంలో భారత్ ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పుతోందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: