రోజుకు కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను కబళిస్తోంది. అందరినీ ప్రాణ భయంతో వణికిస్తుంది.  ఎంతో మంది మృత్యువుతో పోరాడేలా చేస్తుంది. ఇంకెంతో మంది బలి తీసుకుంటుంది.కంటికి కనిపించకుండా దాడిచేసి కాటికి పంపిస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు కంటికి కనిపించని శత్రువు పై పోరాటం చేసేలా చేస్తుంది. కంటికి కనిపించని శత్రువును  నాశనం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఈ  మహమ్మారి వైరస్  ప్రపంచదేశాలను కబళిస్తున్న నేపథ్యంలో కట్టడి చేసేందుకు ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేస్తూ ఆదేశాలు. ఈ నేపథ్యంలోనే కరోనా  వైరస్ రోగులకు చికిత్స అందించేందుకు డాక్టర్లు... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంటికే పరిమితం అయ్యేలా చేసేందుకు పోలీసులు.. కరోనా  వైరస్ ప్రజల దరి చేరకుండా ఉండేలా పరిసరాల పరిశుభ్రత చేసేందుకు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. 

 


 ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న చాలామంది  మహమ్మారి వైరస్ బారినపడి మరణిస్తున్నారు విషయం తెలిసిందే. ముఖ్యంగా డాక్టర్లు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులకు ఈ మహమ్మారి వైరస్ నుంచి  ఎక్కువగా ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ తో పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే కట్టడి లో భాగంగా ముఖ్యంగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని... కరోనా  అనుమానితులను గుర్తించడం మొదటి ముఖ్యాంశం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈ లో సరికొత్త ఆలోచన చేశారు. 

 


 హెల్మెట్ ద్వారా కరోనా వైరస్ బాధితులను కనుగొనేందుకు వినూత్న  ఆలోచన చేశారు అక్కని నిపుణులు. ఒక స్మార్ట్ హెల్మెట్ ప్రతి మనిషిలోని టెంపరేచర్ ఎంత ఉంటుంది అనే దానిని కౌంట్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి  వైపు చూడగానే ఆ మనిషి టెంపరేచర్ ఎంత ఉంది అనే దాన్ని చెబుతుంది. ఇలాంటి స్మార్ట్ హెల్మెట్ ఒకటి  ప్రస్తుతం అక్కడ వాడుకలోకి వచ్చింది. యూఏఈలో ప్రస్తుతం పోలీసులు అందరూ ఇలాంటి స్మార్ట్ హెల్మెట్ వాడుతూ కరోనా  వైరస్ బాధితులను కనుకుంటున్నారు. ఓసారి ఈ వీడియో చూస్తే ఈ స్మార్ట్ హెల్మెట్ ఎలా పనిచేస్తుంది అన్నది మీకు కూడా అర్థమైపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: