ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న  వేళ మహమ్మారి వైరస్ ఎదుర్కునేందుకు మనుషులందరికీ కావాల్సింది రోగనిరోధకశక్తి అనే విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వెలుగు  లోకి వచ్చి నెలలు గడిచి పోతుంది అయినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ కు సరైన వాక్సిన్  మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మహమ్మారి వైరస్ ను ఎదుర్కోవాలంటే ప్రజలు దృఢ  సంకల్పంతో ఉండడంతో  పాటు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి ఉండాలి. అయితే కరోనా  వైరస్ కి విజృంభిస్తున్న  వేళ మొదటి నుంచి భారతీయులకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది అనే ఒక వాదన వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా చైనా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. 

 


 అయితే కరోనా వైరస్ ను  ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తి ఎలా ఉంది అనే దానిపై  వివిధ దేశాల శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా కు సంబంధించిన ఒక శాస్త్రవేత్త తో పాటు అమెరికా కు సంబంధించిన మరో శాస్త్రవేత్త కూడా భారత్లో రోగనిరోధక శక్తికి సంబంధించినటువంటి చేసిన ఓ అధ్యయనం ప్రస్తుతం చర్చకు  దారితీసింది.  ఇండియాలో మానసిక కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు. వాస్తవంగా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దగ్గు జ్వరం జలుబు లాంటిది ఉన్నప్పుడు భారతీయులు తట్టుకుని వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. 

 

జ్వరం జలుబు దగ్గు ఉంది కదా అని రెస్ట్ తీసుకొనే వారు  చాలా తక్కువ మంది ఉంటారు భారత్. చాలామంది తీవ్ర స్థాయిలో జ్వరం ఉన్నప్పటికీ తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతారు. కేవలం తమకు జ్వరం వచ్చింది మా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం ఎవరికైనా నీరసం వచ్చేస్తుంది. లేదు పనిలో నిమగ్నం అయితే జ్వరం ఎంత ఉన్నప్పటికీ హాయ్ గా పని చేసుకుంటారు . ఇది భారతీయులకు అతి ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాళ్లు నొప్పులు వచ్చినా లేదా ఇంకేదైనా వ్యాధితో బాధపడుతున్న తీవ్ర జ్వరం ఉన్నా అవన్నీ లెక్క చేయకుండా రోజువారి పనులు లేదా ఉద్యోగ రీత్యా పనులు చేసుకుంటూ ముందుకు  సాగుతూనే వుంటారు. ప్రస్తుతం ఇదే ఇండియాలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: