2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రక్షణ రంగం బలోపేతం దిశగా మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశం చుట్టూ వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలమైనవి కావు అనే ఆరోపణలు దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. గత పాలకులు కూడా రక్షణ రంగం అభివృద్ధి పై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పటికీ మన దేశంలో పాత కాలం నాటి యుద్ధవిమానాలను వినియోగిస్తున్నారు. 
 
ఆ యుద్ధ విమానాల వైఫల్యాల గురించి అవగాహన ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాటినే వినియోగిస్తున్నారు. సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, సైన్యం దిగడానికి ఏర్పాట్లు లాంటి అంశాలపై కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ మోదీ మాత్రం రక్షణ రంగం బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. రక్షణ రంగ బలోపేతానికి చేస్తున్న ఖర్చుల్లో 2019లో సుమారు 3.6 శాతం మేర పెరిగిందని స్వీడన్ కు చెందిన ఒక సంస్థ వెల్లడించింది. 
 
ఆ సంస్థ లెక్కల ప్రకారం అమెరికా 732 బిలియన్ డాలర్లు, చైనా 261 బిలియన్ డాలర్లు, భారత్ 71.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ప్రభుత్వం ఇంత డబ్బు రక్షణ రంగం కోసం ఖర్చు చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. పేదల కోసం ఈ డబ్బును ఖర్చు పెట్టవచ్చు కదా...? అని ప్రశ్నిస్తున్నారు. రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోకపోతే ఇతర దేశాలకు పెత్తనం చెలాయించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. 
 
చైనా ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ ను మ్యాపులో పెట్టుకుంటూ కయ్యానికి కాలు దువ్వుతోంది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా నుంచి మనకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు. అందువల్ల మన దేశం తగిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాల్సి ఉంది. ఇటీవల అమెరికా నుంచి రక్షణ ఒప్పందాల్లో భాగంగా యుద్ధ విమానాలను, మరికొన్నింటిని కేంద్రం దిగుమతి చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: