ఈ మధ్య కాలంలో వైవ్ ఆఫ్, వ్రైట్ ఆఫ్ అనే అంశాల గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైవ్ ఆఫ్ అంటే పూర్తిగా ఆ రుణం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం.... ఆస్తుల వేలం, సింగిల్ టైమ్ సెటిల్మెంట్ల సమయంలో వైవ్ ఆఫ్ ఎక్కువగా జరుగుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 30 లక్షల రూపాయల బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొన్నాడు. ఆ తరువాత ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల వాయిదాలు చెల్లించలేకపోతే బ్యాంకు ఆ ఇంటిని వేలం వేస్తుంది. 
 
వేలం వేసిన తరువాత బ్యాంకు సిబ్బంది వారికి రావాల్సిన సొమ్మును తీసుకుని ఎక్కువ వచ్చిన సొమ్మును రుణం కట్టని వారికి ఇస్తారు. ఆ తరువాత ఆ రుణానికి బ్యాంకుకు ఎటువంటి సంబంధం ఉండదు. రికార్డులలో చూపించనటువంటి లెక్కలను వ్రైట్ ఆఫ్ అంటారు. ఉదాహరణకు ఒక సంస్థకు బ్యాంకు రుణం ఇస్తుంది. ఆ సంస్థకు నాలుగు లేదా ఐదు వ్యాపారాలు ఉంటాయి. 
 
వ్యాపారాల్లో కొన్ని లాభాల్లో ఉంటే మరికొన్ని నష్టాల్లో ఉంటాయి. గతంలో నష్టాల్లో ఉన్న కంపెనీల డబ్బులను కూడా లాభాల్లో ఉన్న కంపెనీలకు మళ్లించి వ్యాపారులు అవి నష్టాల్లో ఉన్నాయని ఆ డబ్బులను వైవ్ ఆఫ్ చేయించుకునేవారు. సాధారణంగా వ్రైట్ ఆఫ్ లో మాత్రం రాని బాకీలను నష్టాలలో రాసుకోవాలి. కానీ నష్టాలలో రాసుకుంటే అ బ్యాంకు యొక్క లాభాలు తగ్గిపోతాయి. అలా నష్టపోయిన వ్రైట్ ఆఫ్ రుణాలను పలు సందర్భాల్లో కేంద్రం ఉద్ధీపన ప్యాకేజీల ద్వారా చెల్లించి బ్యాంకులకు ప్రయోజనం చేకూర్చుతుంది. 
 
వ్రైట్ ఆఫ్ రుణాలను బ్యాంకులు కేంద్రం ఇచ్చిన ఉద్ధీపన ప్యాకేజీల ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది. వ్రైట్ ఆఫ్ కు సంబంధించిన రుణాలను రికార్డుల్లో చూపించకపోవడం వల్ల బ్యాంకుల షేర్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు దేశంలో బినామీ ఆస్తుల చట్టం కూడా ఈ సమస్యకు పరిష్కారంలా ఉంది. ఒక సంస్థ లాభాల్లో ఉండి నాలుగు సంస్థలు నష్టాల్లో ఉంటే ఆ లాభాల్లో ఉండే సంస్థల నుంచే నష్టాలకు సంబంధించిన రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: