చైనాలోని వుహాన్ లో బయటపడిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా అమెరికాలో హెచ్ 1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డుదారులకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ కారణాల వల్ల నోటీసులు అందుకున్న వారికి స్పందించేందుకు ఇచ్చిన గడువును 60 రోజులకు పెంచుతున్నట్టు అమెరికా తెలిపింది. 
 
హెచ్ 1బీ వీసాలతో అమెరికాలో పని చేస్తున్న వారిలో భారతీయులే అధికంగా ఉండటంతో భారత్ పై ఈ ప్రభావం అత్యధికంగా పడనుందని తెలుస్తోంది. అమెరికాలో ఉన్న భారతీయులు ప్రస్తుత సంక్షోభం వల్ల అమెరికాలో ఉండలేక, స్వస్థలాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2,00,000 మంది జూన్ చివరినాటికి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. కరోనా వల్ల రెండవ ప్రపంచ యుద్ధం నాటి కంటే ఇబ్బందులు పడే వారి సంఖ్య ఎంతో పెరగనుంది. 
 
 
మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా లాక్ డౌన్ ఎత్తివేసినా భారీ స్థాయిలో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల వల్ల చనిపోయిన వారి కంటే కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న తరుణంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం గమనార్హం. ఈ వైరస్ చైనా సృష్టించిందా...? సహజసిద్ధంగా వైరస్ పుట్టిందా...? అనే విషయం తెలియాల్సి ఉంది. 
 
కరోనా రూపంలో వచ్చిన మూడో ప్రపంచ యుద్ధంలో భారీ స్థాయిలో ఆర్థిక ఆరోగ్య విధ్వంసం సంభవిస్తోంది. అయితే ఈ వైరస్ పై ప్రపంచం విజయం సాధిస్తుందా...? కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడం సాధ్యమవుతుందా...? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. మరి కరోనా నుంచి కోలుకోవడానికి, కరోనాపై విజయం సాధించడానికి ప్రపంచ దేశాలకు ఎంతకాలం పడుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: