సహజమైన ప్రకృతి అందాలకు నెలవుగా విశాఖను పిలుస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం, సముద్ర తీరం, ఎత్తయిన కొండలు ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రకృతి అందాలకు లోటేలేదు. విశాఖలో జీవించడం అంటే అది ఒక గొప్ప వరంగా చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే నాణానికి మరో వైపు చూస్తే నగరాన్ని అన్ని వైపుల కాలుష్యం చుట్టుముట్టింది. విశాఖ చుట్టుపక్కల ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు ఒకవైపు, మరోవైపు విశాఖ పోర్టు, ఇలా అన్నివైపుల కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. విశాఖను కాపాడాలంటూ ఈ ప్రాంత వాసులు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా, ఫలితం కనిపించకపోవడంతో, ఆ కాలుష్యంతోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కానీ నుంచి విశాఖను బయట పడే విధంగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో ప్రమాదకరమైన రసాయనిక పరిశ్రమలు విశాఖలో ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా, ఈ పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయి. 

 

IHG's old town: Andhra PCB sends notice to Port ...

తాజాగా ఎల్జి పాలిమర్స్ అనే పరిశ్రమ నుంచి అనేక విష వాయువులు వెలువడ్డాయి. వందల మంది దీని ప్రభావానికి గురయ్యారు. బాధితుల సంఖ్య వేలల్లో ఉంది. 1990 లో పారిశ్రామిక రంగానికి కేంద్రం పెద్దపీట వేయడంతో బీహెచ్ పివి , జింకు షిప్ యార్డ్, హెచ్ పి ఏఈ ఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమల తో పాటు, కోరమండల్ ఫెర్టిలైజర్స్, గుజరాత్ ఎస్సార్ వంటి ప్రైవేట్ పరిశ్రమలో ఎన్నో ఏర్పాటయ్యాయి. పారిశ్రామికంగా విశాఖ బాగా అభివృద్ధి చెందింది. అయితే ఇటీవల ప్రైవేటు రంగంలో నెలకొల్పిన గంగవరం పోర్ట్ నుంచి వచ్చే కాలుష్య కారకాలు విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారాయి. వీటితో పాటు జింక్, గుజరాత్ ఎస్సార్, కోరమండల్ పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు , వ్యర్ధాలు, ప్రజల ఆరోగ్యాలకు చేటు చేస్తున్నాయి. విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, ఇనుప ఖనిజం బొగ్గు, గంధకం, స్టాక్ యార్డ్ నుండి, కన్వేయర్ బెల్ట్ ల నుండి వెలువడే రసాయన ధూళితో కూడిన గాలిని పీల్చడం ద్వారా ప్రజలు అనేక శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నారు. 

 

IHG

విశాఖ కు ఉన్న భౌగోళిక ఆకృతి, గాలి వాటం కారణంగా కాలుష్యం ఎటూ వెళ్ళకుండా నగరంలోనే ఉండిపోవడంతో నగర వాసులు విషపూరిత వాతావరణంలోనే తమ జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. నగరానికి ఒక వైపు బంగాళాఖాతం ఉండగా, మూడు వైపులా తూర్పు కనుమలు వ్యాపించిన ఉన్నాయి. వీటి మధ్య సుమారు 260 కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరం చాలా వరకు విస్తరించింది. నగరానికి నైరుతి దిక్కున అనేక పరిశ్రమలు ఉండడంతో ఏడాదికి ఎనిమిది నెలల పాటు అంటే మార్చి నుండి అక్టోబర్ వరకు అవి వెలువరించే వాయు కాలుష్యాలు, గాలివాటం తో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2009లో విశాఖ నగరం దేశంలోనే అత్యంత తీవ్ర కాలుష్య కోరల్లో ఉన్న నగరంగా పేర్కొంది.

 

IHG

 

 దీని కారణంగా కొత్తగా ఏ పరిశ్రమకు విశాఖ నగరంలో అనుమతి ఇవ్వకూడదనే నిబంధనలు కూడా విధించారు. అయితే పారిశ్రామికవేత్తల ఒత్తిడితో, రాజకీయ నాయకుల సిఫార్సులతో 2013లో కాలుష్య నగరాల జాబితా నుంచి విశాఖపట్నం ను తొలగించారు. విశాఖలో కాలుష్యం అదుపులోకి వచ్చిందని దీనికి సాకుగా చూపించారు. ప్రస్తుతం విశాఖలోని వెంకటాపురంలో విషవాయువులు లీక్ కావడం, కొంత మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం వేలాది మంది అస్వస్థతకు గురవడంతో, మరోసారి విశాఖ కాలుష్యం అంశం తెర మీదకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: