దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ ఇంటికే పరిమితం అయ్యేలా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 40 రోజుల వరకు పూర్తిస్థాయిలో లాక్ డౌన్  కొనసాగింది. ఇక ఆ తర్వాత కొన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో సడలింపులు ఇస్తూ మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దుకాణ సముదాయాలు సహా మరికొన్ని సేవలు తెరుచుకునేలా సడలింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పటివరకు రవాణా వ్యవస్థకు సంబంధించి సడలింపులు మాత్రం ఇవ్వలేదు. 

 

 

 లాక్ డోన్ విధించిన నాటినుంచి రోడ్డు రవాణా రైలు రవాణా విమానయాన సర్వీసులు అన్ని నిలిచిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారికి వెళ్లేవారికి విమాన సర్వీసులు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా లాక్ డౌన్  సడలింపులలో   భాగంగా విమానాల సేవలు ప్రారంభమయ్యేలా పలు  మార్గదర్శకాలను సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం. 

 

 

 ఓవైపు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్న మరోవైపు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. లాక్ డౌన్  తర్వాత ప్రారంభమయ్యే విమాన సేవల విషయంలో... పౌర విమానయాన శాఖ పలు నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ముందులాగా సమయానికి ఎయిర్పోర్టుకు వచ్చి  విమానం ఎక్కడానికి వీలులేదని ఎయిర్పోర్టుకు రెండు గంటల ముందు వచ్చే కరోనా  వైరస్ కు సంబంధించిన సమాధాన పత్రాన్ని నింపాల్సి ఉంటుంది అంటూ తెలిపింది. ఇక ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికులు అందరికీ ముందుగా థర్మల్  స్క్రీనింగ్ చేయడంతో పాటు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాతనే విమానంలోకి ఎక్కేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. ఇక విమానంలోకి క్యాబిన్ బ్యాగు అనుమతి నిషేదించ గా.... కేంద్ర ప్రభుత్వం సూచించిన ఆరోగ్య సేతు  యాప్ లో ప్రయాణికులు అందరికీ గ్రీన్ స్టేటస్ తప్పనిసరిగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: