ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం కరోనా తగ్గుముఖం పట్టినా రాష్ట్రంలో వైరస్ మరలా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఈరోజు 48 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 2205కు చేరింది. 1353 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 803 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 49 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. 
 
అయితే రాష్ట్రంలో ప్రకాశం జిల్లా మాత్రం కరోనా నుంచి కోలుకుంది. జిల్లాలో 63 కరోనా కేసులు నమోదు కాగా 63 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలోని కరోనా రోగులు అందరూ కూడా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడం శుభ పరిణామం అనే చెప్పాలి మరోవైపు జిల్లాలో గత కొన్ని రోజులుగా కొత్త కేసులు నమోదు కావడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్కరు కూడా కరోనా భారీన పడి మరణించలేదు. 
 
అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల వల్లే జిల్లాలో కొత్త కేసులు నమోదు కావడం లేదని తెలుస్తోంది. జిల్లా ప్రజలు మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ కొత్త కేసులు నమోదు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. జిల్లా ప్రజలు, అధికారులు కలిసి కరోనాను నియంత్రించడంలో సఫలం అయ్యారు. జిల్లాలో కరోనా బాధితులందరూ డిశ్చార్జ్ కావడంతో ప్రకాశం జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 
 
మరోవైపు రాష్ట్రంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 608 కరోనా కేసులు నమోదు కాగా 19 మంది మృతి చెందారు. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆ తరువాత స్థానాలలో ఉన్నాయి. రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అత్యల్పంగా ఏడు కేసుల చొప్పున నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: