ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది.  నాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు పాకినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 47,17,038 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 3,12,384 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,94,555. ఇక, 18,10,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.  అమెరికాలో కరోనా కరాళ నృత్యం కొనసాగిస్తుంది.  అయితే కరోనా కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం నానా తంటాలు పడుతుంది. సాధారణంగా దోపిడీ కోసం వచ్చిన వారు తమ ముఖాలు కనిపించకుండా ఏదైనా మాస్క్ ధరిస్తుంటారు.. లేదా ఏదైనా బొమ్మ ముఖాలు పెట్టుకోవడంకొన్ని సార్లు హెల్మెట్ పెట్టుకొని దోపిడీలు చేసిన వారిని చూశారు.  తాజాగా ముఖానికి పుచ్చకాయలు పెట్టుకొని సూబర్ బజార్ ని దోచుకు పోయారు.   

 

తమ క్రియేటివిటీని మెచ్చుకోండంటూ దోపిడీకి ముందు సీసీ కెమెరాల ముందు నిల్చును పోజులు కూడా ఇచ్చారు. అమెరికాలోని వర్జీనియాలో ఈ తతంగం చోటుచేసుకుంది.  లూయిసా ప్రాంతంలోని ఓ షాపు వద్దకు కారులో వచ్చిన బందిపోట్లు తలకు పుచ్చకాయలు పెట్టుకొని దిగారు.  మొదట ఈ దొంగల చూసిన షాప్ సిబ్బంది.. కస్టమర్లు ఫన్నీగా తీసుకున్నారు. కానీ తర్వాత తెలిసింది వారు దోపిడీకి వచ్చారని తెలుసుకున్నారు. అంతే ఆశ్చర్యంతో నివ్వెరపోయారు.. ఈ లోపు దొంగలు తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు.   

 

షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును గంటల్లోనే ఛేదించారు. దొంగలను అరెస్ట్ చేశామని, వారి క్రియేటివిటీ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే దొంగ పుచ్చకాయలు ఏం దోచుకోన్నాయో మాత్రం తెలియడం లేదు.  దొంగతనాకిి ఇలా వెరైటీగా రావడం చాలా అరుదు అని ఎవరూ నమ్మలేకపోయారని అన్నారు. అయితే దొంగల చివరిగా చేసిన ఓవర్ యాక్షన్ వారిని పట్టుబడేలా చేసిందంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: