ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాపై కరోనా ప్రభావం ఎక్కువగా పడింది. అమెరికాలో 15 లక్షల కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య లక్షకు చేరువలో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా విషయంలో చైనాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 
 
చైనా నిర్లక్ష్యం వల్లే ప్రపంచ దేశాలు ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. మరోవైపు ప్రంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ గురించి స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. భారత్ సహా 120 దేశాలు స్వతంత్ర దర్యాప్తుకు మద్దతు ఇచ్చాయి. చైనా కూడా మద్దతు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అని భయపడి తప్పనిసరి పరిస్థితుల్లో స్వతంత్ర దర్యాప్తుకు మద్దతు ఇచ్చింది. 
 
తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను పక్కన పెట్టకపోతే మేమే కొత్త సంస్థను తయారు చేస్తామని తాజాగా అమెరికా ప్రకటన చేసింది. అమెరికా కరోనా విషయంలో చైనా తీరును, ప్రపంచ ఆరోగ్య సంస్థ ధోరణిని తప్పుబడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి చైనా తప్పుకుంటే మాత్రమే తాము కొనసాగుతామని అమెరికా స్పష్టం చేసింది. మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా హెఛరిక విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 
 
అమెరికా కోపంతో ఈ నిర్ణయం తీసుకుందా...? ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరుతో విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకుందా చూడాల్సి ఉంది. అమెరికా ఇచ్చిన సీరియస్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఈ స్టేట్ మెంట్ తో అటు చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థలకు భారీ షాక్ ఇచ్చింది. ఇతర దేశాలు కూడా అమెరికా నిర్ణయానికి మద్దతు పలికితే మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు దూరం అయ్యే అవకాశం ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: