ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్ సెంటర్ కి  పంపిస్తున్న విషయం తెలిసిందే. క్వారంటైన్  సెంటర్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి...  వైరస్ బారిన పడ లేదు అని నిర్ధారణ అయ్యాక వారిని క్వారంటైన్ సెంటర్ నుంచి వదిలి పెడుతున్నారు. తాజాగా ఇక్కడ కొంతమంది  కొంత మందిని  పోలీసులు అదుపులోకి తీసుకొని క్వారంటైన్  సెంటర్ కు తరలించారు. ఇక వీరిలో ఐదుగురికి  పాజిటివ్ అని తేలడంతో మిగిలిన వారిని కూడా క్వారంటైన్ సెంటర్ లోనే ఉంచారు. అయితే క్వారంటైన్ సెంటర్లో బుద్ధిగా ఉండాల్సిన బార్ డాన్సర్లు కాస్త తమకు మద్యం కావాలంటూ హల్చల్ చేశారు. అయితే మందు లేదు అంటూ అక్కడి సిబ్బంది సమాధానం ఇవ్వడంతో ఏకంగా క్వారంటైన్  సెంటర్ లోనే  డ్యాన్సులు చేస్తూ హల్చల్ సృష్టించారు. 

 

 ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మొర్దాబాద్ లో చోటుచేసుకుంది. ఇటీవలే ముంబై నగరం నుంచి మొర్దాబాద్  కి 72 మంది వచ్చారు. ఇక వీరందరినీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్వారంటైన్  కు తరలించారు. కరోనా  నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో ఐదు మందికి ఈ వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో మిగిలిన వారిని కూడా క్వారంటైన్  సెంటర్ లోనే ఉంచారు పోలీసులు. 72 మందిలో 40 మహిళలు, 20 మంది పురుషులు, 12 మంది పిల్లలు ఉన్నారు. కాగా ఈ  సెంటర్లో ఉన్న 40 మంది మహిళల్లో  కొంత మంది బార్  డాన్సర్లు కూడా ఉండటం గమనార్హం. కాగా బాధితులు తమకు ఆల్కహాల్ కావాలి అంటూ అక్కడి హెల్త్ వర్కర్ లను డిమాండ్ చేశారు. 

 

 మందు లేదని అలాంటివి క్వారంటైన్ సెంటర్లో కి అనుమతించబడవు అంటూ హెల్త్ వర్కర్లు స్పష్టం చేయడంతో బార్  డాన్సర్లు రెచ్చిపోయి  హల్ చల్ చేశారు. ఏకంగా క్వారంటైన్  సెంటర్ లో డ్యాన్సులు చేస్తూ కాసేపు గందరగోళం కూడా సృష్టించారు. తమను వెంటనే ఇంటికి పంపించేయాలని  లేకపోతే తాము ఇలాగే గందరగోళం సృష్టిస్తాము  అంటూ బెదిరించారు. ఇక ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మరికొంతమంది మొబైల్ లో చిత్రీకరించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా  వైరల్ గా మారిపోయింది. అయితే కరోనా  నెగిటివ్ అని తేలితేనే  ఇంటికి పంపిస్తాము  అంటూ తేల్చి చెప్పారు హెల్త్ వర్కర్. ఇక ఇలా గందరగోళం సృష్టించిన బార్ డాన్సర్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: