ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం కరోనా భారీన పడి మృతి చెందినట్టు సోషల్ మీడియా, వెబ్ మీడియా, ప్రముఖ జాతీయ స్థాయి వెబ్‌సైట్లలో ప్రచారం జరుగుతోంది. ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో దావూద్ ఇబ్రహీం ఒకరు. దావూద్ ఇబ్రహీంకి కరోనా వైరస్ సోకినట్లు నిన్న వార్తలు వచ్చాయి. పాక్ ప్రభుత్వ వర్గాల నుంచే ఈ వార్త బయటకు వచ్చిందని ప్రముఖ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 
 
అయితే అతని సోదరుడు మాత్రం నిన్న ఈ వార్తలను ఖండించాడు. ఈరోజు దావూద్ చనిపోయాడన్న వార్తను న్యూస్ ఎక్స్ ఛానెల్ తమ సొషల్ మీడియా ఖాతా ద్వారా పేర్కొంది. దావుద్ కరోనాతో మృతి చెందినట్టు తమకు సమాచారం ఉందని ఆ సంస్థ తెలిపింది. అతని తమ్ముడు అనీస్ ఇబ్రహీం మాత్రం తన అన్నకు, వదినకు ఏం కాలేదని వారు క్షేమంగా ఉన్నారని చెప్పాడు. అయితే వారు ఎక్కడ ఉన్నారో మాత్రం చెప్పలేదు. 
 
దావూద్ ఇప్పటికీ పాక్, యుఏఈలలో వ్యాపారాలు చేసుకుంటున్నాడని అనీస్ చెప్పడం సందేహాలకు తావిస్తోంది. తన జోలికి ఎవరూ రాకుండా అన్న పేరును వాడుకోవడానికే అనీస్ ఇలా చెప్పాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కరోనా నిర్ధారణ కావడంతో దావూద్ మరియు అతని భార్యను కరాచీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించినట్లు కొన్ని రోజుల క్రితం నుంచి వార్తలు వస్తున్నాయి. 
 
అయితే దావూద్ నిజంగా మృతి చెందాడా...? లేదా..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. నెటిజన్లు సోషల్ మీడియాలో ఎవ్వరూ చేయలేని పని కరోనా చేసిందనే కామెంట్లు చేస్తున్నారు. దావూద్ కు బీపీ షుగర్ తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉన్నట్టు సమాచారం అందుతోంది. ముంబైలో మారణ హోమం సృష్టించిన దావూద్ చట్టాల నుంచి తప్పించుకున్నా కరోనా నుంచి తప్పించుకోలేకపోయాడని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ వివాదాస్పద క్రికెటర్ జావేద్ మియాందాద్ దావూద్ ఇబ్రహీం వియ్యంకులు. దావూద్ కుమార్తెను మెయిన్ కొడుకు కి ఇచ్చి వివాహం చేశారు.

 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: