ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రస్తుతం మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నాయి . అయితే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా  వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా  వైరస్ కట్టడి చర్యలపై ఢిల్లీ సర్కార్ వ్యవహరిస్తున్న తిరుపై  సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కరోనా  వైరస్ రోగుల పట్ల ఆసుపత్రిలో సిబ్బంది వ్యవహరించిన తిరును  తీవ్రంగా తప్పు పట్టింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఆసుపత్రిలో రోగులను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు అంటూ వచ్చిన ఆరోపణలను సుమోటోగా స్వీకరించి.. కేజ్రీవాల్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడింది సుప్రీంకోర్టు. కరోనా  వైరస్ రోగుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 


 ప్రస్తుతం కరోనా  వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన రోగులు అందరికీ సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపిన సుప్రీంకోర్టు... దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం కరోనా  వైరస్ రోగులకు సమర్థవంతంగా చికిత్స అందించకపోవడాన్ని  తప్పుబట్టింది. కరోనా  వైరస్ నివారణకు  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తిరుపై  ఆందోళన కూడా వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఓవైపు రోజురోజుకు కేసులో పెరుగుతుంటే రాష్ట్రంలో కరోనా  వైరస్ టెస్ట్ లు  సంఖ్య తగ్గించడం ఏంటి అంటూ కేజ్రీవాల్ సర్కారును ప్రశ్నించింది సుప్రీంకోర్టు. తక్షణమే  దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ పరీక్షా కేంద్రాలను పెంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 

 


 అంతేకాకుండా ఈ మహమ్మారి వైరస్ బారినపడి మరణించినవారి మృతదేహాలు పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదు అంటూ వ్యాఖ్యానించింది  సుప్రీంకోర్టు. ఢిల్లీలో కరోనా  వైరస్ కారణంగా మరణించిన వారి మృతదేహాలు నిర్వహణ అమానుషంగా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. అయితే దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. కరోనా వైరస్ కేసులు విషయంలో కాస్త నిర్లక్ష్యంగానే  వ్యవహరిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: