ప్రస్తుతం చైనా భారత్ వ్యవహారమే కాదు ఇరాన్ ఇజ్రాయిల్  మధ్య వివాదం కూడా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది రోజురోజుకీ. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య రోజురోజుకు వివాదం ముదురుతోంది. మొన్నటి వరకు భారత్ తో  మిత్ర దేశంగా ఉన్న ఇరాన్ భారత నీడలో భద్రంగా ఉంది.. దీంతో భారత మరో మిత్ర దేశమైన ఇజ్రాయిల్  నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంది. కానీ గత కొంతకాలం క్రితం చైనా కు  మద్దతు తెలుపుతూ భారత్ తో  సంబంధాలను తెంచుకుని... చైనా తో సంబంధం బలపరుచుకుంది ఇరాన్. కాగా  సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న ఇజ్రాయిల్ ఇరాన్ పై విరుచుకు పడుతుంది, ముఖ్యంగా ఇజ్రాయిల్ గూఢచార వ్యవస్థ ద్వారా కీలక సమాచారాన్ని సేకరిస్తూ ఊహించని దాడులకు దిగుతున్నది ఇజ్రాయిల్. 

 

 గత కొన్ని రోజుల నుంచి ఇరాన్ పై  ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న వివాదం ప్రస్తుతం తారాస్థాయికి చేరుతుంది. మొన్నటికి మొన్న అణు  ఆయుధాలు తయారు చేసేటువంటి కర్మాగారాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది ఇజ్రాయిల్. ఇక ఆ తర్వాత ఇరాన్ నౌకాదళం కి సంబంధించిన దాదాపు పదికి పైగా యుద్ధనౌకలను  ఒక్కసారిగా తగలబెట్టంది  ఇజ్రాయిల్. ఇక ఆ తర్వాత ఏకంగా ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఇజ్రాయిల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ మొన్నటికి మొన్న.. సమావేశం జరుగుతున్న స్థావరం పై కూడా దాడులకు పాల్పడి ఇరాన్ కి  భారీ షాక్ ఇచ్చింది . 

 

 ఇక ఇప్పుడు మరో సారి ఊహించని దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఇరాన్ లో మిస్సైల్స్  దాచి ఉంచిన స్థలాన్ని గుర్తించి..  తమ మిసైల్స్  తో దాడి చేసి ధ్వంసం చేసింది ఇజ్రాయిల్ . ఇలా వరుసగా ఇరాన్ పైన దారుణంగా దాడులకు పాల్పడుతోంది ఇజ్రాయిల్. ఇక ఇజ్రాయిల్ రోజురోజుకీ కొడుతున్న దెబ్బలు ఇరాన్ ను  ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అని చెప్పాలి. ఇన్ని దాడులు జరిగినప్పటికీ ఇరాన్  మాత్రం బయటకు చెప్పుకోవడం లేదు. ఒకవేళ ఈ విషయం బయటకి వస్తే ఇది ప్రభుత్వ  అసమర్థత అని ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఇరాన్ సైలెంట్ గానే ఉండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: