దేశంలో ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న క్రైమ్ రేటు మాత్రం తగ్గడం లేదు. దేశంలో ఎదో ఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలను రక్షణకై దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నప్పడికి కామాంధుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. చిన్న పిల్లల నుండి కాటికి కాలుచాపిన ముసలి వాళ్లదాకా కామ పిశాచాల ఆగడాలకు బలవుతున్నారు. తాజాగా మరో మహిళ కామాంధుడి వికృత చేష్టలకు బలయ్యింది. ఘటన ఈ ఘటన నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
డాక్టర్ ను దేవుడితో సమానంగా చూస్తారు. రోగులకు వైద్యం చేయాల్సిన వైద్యుడే కీచకుడి అవతారమెత్తాడు. కరోనాతో బాధపడుతూ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న యువతిపై కన్ను వేసి లోబర్చుకోవాలని చూశాడు. ఆమె అతనికి లొంగకపోవడంతో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నోయిడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన 20ఏళ్ల యువతికి ఇటీవల కరోనా వైరస్ సోకింది. ఆమె పరీక్షలు చేయించుకోగా అందులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అదే హాస్పిటల్‌లో కరోనా రోగులకు చికిత్స అందించే డాక్టర్‌కు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ డాక్టర్ కూడా యువతి ఉండే ఐసోలేషన్ వార్డులోనే చికిత్స పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో ఆ డాక్టర్ తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని యువతి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్దిరోజులుగా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపింది. అయితే సోమవారం వార్డులోనే తన కోరిక తీర్చాలంటూ తనపై అఘాయిత్యానికి యత్నించినట్లు ఫిర్యాదులోతెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా ఆసుపత్రి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంకా ఐసోలేషన్ వార్డులోనే ఉండటంతో అక్కడే అతడిని విచారిస్తామని తెలియజేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి