నిత్య పెళ్లి కూతురు అసలు పేరు హరిణి. ఈమె గుట్టు ఇపుడు బట్టబయలు అయిపోయింది. పతంగి స్వప్న.. అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న ఇలా రకరకాల పేర్లతో అబ్బాయిలను మోసం చేయడమే తన పనిగా పెట్టుకుంది.
తొలుత గతేడాది డిసెంబర్ లో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. అతడితో హైదరాబాద్ ోల కాపురం పెట్టింది. ఆ వ్యక్తికి డెన్మార్క్ లో ఉద్యోగం రావడంతో ఆమెతో కలిసి డెన్మార్క్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పాస్ పోర్ట్ అడగడంతో ఏదేదో కహానీ చెప్పి తప్పించుకుంది. దీంతో ఆ వ్యక్తి డెన్మార్ వెళ్లిన తర్వాత ఆమె వ్యవహార శైలిపై అనుమానం వచ్చింది. సైలెంట్ గా కూపీ లాగడంతో ఈ కిలాడీ అసలు గుట్టు బట్టబయలైంది.
ఇతనిని పెళ్లి చేసుకోక ముందు మరో ఇద్దరితో పెళ్లి జరిగినట్టు తెలిసిపోయింది. అంతేకాదు ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం అందింది. ఈ విషయంపై భార్యను నిలదీడంతో.. ఆ కిలాడీ ఏ మాత్రం జంకలేదు. తాను తప్పు చేశానన్న పశ్చాత్తాపం కూడా ఆమెలో కలుగలేదు. పైగా ఆ వ్యక్తిని ముప్పై లక్షలు ఇచ్చి సెటిల్ మెంట్ చేసుకోవాలని డిమాండ్ చేసింది. అతడు బెదిరింపులకు బెదరకపోవడంతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. నెమ్మదిగా కూపీ లాగిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిశాయి. నిత్య పెళ్లి కూతురును అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టి .. చిప్పకూడు తినిపిస్తున్నారు ఖాకీలు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి