కేంద్ర ప్రభుత్వం నుంచి అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించుకోవాలని  అనుమతులు వచ్చినప్పటికీ... ఏపీ తెలంగాణల మధ్య సరైన ఒప్పందం కుదరక పోవడంతో ఇప్పుడు వరకు పూర్తిస్థాయిలో రెండు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా సర్వీసులు మాత్రం ప్రారంభం కాలేదు. అయితే వరుసగా ఏపీ రవాణా శాఖ తెలంగాణ రవాణా శాఖకు ప్రతిపాదనలు పంపుతున్నప్పటికి కూడా తెలంగాణ ఆర్టీసీ మాత్రం స్పందించడం లేదు. మొన్నటికి మొన్న ఇరు రాష్ట్రాల మధ్య అంతర్  రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభించేందుకు చర్చలు జరిపినప్పటికీ చర్చలు కూడా సఫలం కాలేదు అన్న విషయం తెలిసిందే.



 దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభం అవుతాయని వేచి చూసిన ప్రయాణికులు అందరికీ నిరాశ ఎదురైంది అని చెప్పాలి. మరికొన్ని రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్రం నుంచి భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ మంది వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో సరైనా బస్సు సౌకర్యాలు లేక పోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణంగా అయితే పండగ సీజన్లలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకుని... పండుగ సీజన్లో ప్రత్యేకంగా సరికొత్త బస్సు సర్వీసులను ప్రారంభిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటివరకు ఇలాంటి చర్చలు జరుగుతున్నట్లు మాత్రం ఎక్కడా టాక్  కూడా వినపడలేదు.




 ఇక ఇటీవల దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారు కృష్ణ బాబు. ఈ నెల 15 నుంచి రెండు రాష్ట్రాల మధ్య అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులను ప్రారంభించేందుకు ముందస్తు రిజర్వేషన్లు ప్రారంభిద్దాం అంటూ పేర్కొన్నారు ఆయన.  కాగా దీనిపై తెలంగాణ రవాణా శాఖ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. టీఎస్ఆర్టీసీ నిర్ణయం కోసం ప్రయాణికులు ఆశగా చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: