అది మహాభారత కాలం.. ద్రోణుడు పాండవులకు విద్యలు నేర్పుతున్నాడు. పాండవులంతా ఆయన వద్ద వివిధ రకాల యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో ద్రోణుడు విలువిద్యను పాండవులతో అభ్యసనం చేయిస్తున్నాడు. చెట్టుపై ఉన్న ఓ పక్షిని కొట్టాలన్నది లక్ష్యం.. పాండవుల ఏకాగ్రతను పరీక్షించాలనుకున్నాడు ద్రోణుడు.. పాండవులందరినీ పిలిచి ఆ పిట్టను లక్ష్యంగా చేసుకోమన్నాడు. అందరూ విల్లంబులు ఆ పక్షికేసి ఎక్కు పెట్టారు. ఒక్కొక్కరినీ మీకు ఏం కనిపిస్తుందని ద్రోణుడు అడిగారు.

అందరూ ఆ చెట్టు కనిపిస్తోంది.. కొమ్మలు కనిపిస్తున్నాయి.. అంటూ సమాధానం చెప్పారు. అర్జునుడు మాత్రం పిట్ట, పిట్ల కన్ను మాత్రమే కనిపిస్తున్నాయన్నాడు. అదీ ఏకాగ్రత అంటే.. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పరిస్థితి అదే. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాడు. అవన్నీ ఓ లిస్టు రాసుకున్నాడు.. ఆయన ప్రధాన కర్తవ్యం ఆ జాబితాయే.. పాదయాత్రలో ఏమేం హామీలు ఇచ్చాడో ఓ లిస్టు మెయింటైన్ చేస్తున్నాడు. అందులో హామీలు పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

ఏదో ఎన్నికల్లో హామీలు ఇచ్చేశాం.. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాం అనుకోవడం కాకుండా.. ఒక్కొక్క హామీ పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే సీఎం వైయస్‌ జ‌గ‌న్ ప్రజా సంకల్పయాత్రలో ప్రజ‌ల‌కు ఇచ్చిన మాట ప్రకారం వైయ‌స్ఆర్ బీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నార‌ు.


నిరు పేద కుటుంబాలకు జీవన భద్రత కల్పించేందుకు బియ్యం కార్డులున్న కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ‘వైయ‌స్సార్‌  బీమా’ పథకాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఈబీమా ప‌థ‌కానికి గ‌తంలో కేంద్ర ప్రభుత్వం స‌హ‌కారం అందించేది. కానీ ఇప్పుడు కేంద్రం త‌ప్పుకోవ‌డంతో వై య‌స్సార్‌ బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది కూడా. ఈ పథకం ద్వారా 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: