ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏ రేంజిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారణంగానే పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఇటీవలే పాక్ కాల్పులకు తెగబడటం .. అంతేకాకుండా ఉగ్రవాదులను భారీగా విధ్వంసం సృష్టించేందుకు తరచూ భారత్లోకి పంపిస్తూ ఉండటంతో ప్రస్తుతం మరింత ఉద్రిక్తంగా మారిపోయింది పరిస్థితి. పాకిస్తాన్ కాల్పులతో .. ఆగ్రహంతో ఊగిపోయిన భారత సైన్యం ఎడతెరిపి లేకుండా కాల్పులు జరుపుతూనే ఉంది. ఒకప్పుడు కేవలం తుపాకులతో మాత్రమే ఎదురు కాల్పులు జరిపి ఊరుకునే భారత సైన్యం ఇప్పుడు మాత్రం ఏకంగా మిస్సైల్స్ ప్రయోగించడం సంచలన గా మారిపోయింది




 ఒకరకంగా పాకిస్థాన్ పై  పరోక్ష యుద్ధం చేస్తుంది భారత్. అయితే పాకిస్తాన్ దాడితో భారత్ కి షాక్ ఇవ్వాలని అనుకున్న ఇమ్రాన్ ఖాన్ కి ప్రస్తుతం భారత్  ఎడతెరిపి లేకుండా  ఎదురు దాడి చేస్తూ పాకిస్తాన్ సైన్యాన్ని ఎక్కడికక్కడ మట్టుబెట్టి కోలుకోలేని దెబ్బ కొడుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కీ  ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు తెలుస్తోంది. భారత ఆర్మీ కాల్పులకు భయపడి ఎంతో మంది పాక్ సైనికులు అడవుల్లోకి వెళ్లి తలదాచుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం పీవోకే మొత్తం అగ్నిగుండం రగిలి పోతుంది అన్నది అర్థం అవుతుంది.



 అయితే పాకిస్తాన్ ప్రజల్లో అక్కడి ఆర్మీ లో కూడా ఇమ్రాన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో భారత్లో విధ్వంసం సృష్టించి భారత ఏడుపుతో పాకిస్తాన్ ప్రజలను సంతృప్తి పరచాలని అనుకున్న ఇమ్రాన్ కీ  ప్రస్తుతం భారత్ ధీటుగా  బదులు  ఇవ్వటంతో  ఏడ్చే పరిస్థితి వచ్చింది. దీంతో రానున్న రోజుల్లో పీవోకేలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఊహకందని విధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఎంత నష్టం వాటిల్లింది... ఎంత మంది చనిపోయారు అనేది అధికారికంగా ధ్రువీకరణ జరగకపోయినప్పటికీ  మరి కొన్ని రోజుల్లో... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే దానిపై మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: