వైసీపీ ఎమ్మెల్యే మరియు ఎంపీ ల మధ్య రాజుకున్న వివాదం...! ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణకు దిగిన నేతలు...! అర్థాంతరంగా ఆగిపోయిన డీఆర్సీ సమావేశం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...! ఈ మధ్య కాలంలో ఒకే పార్టీలోని నేతలు సైతం ఒకరిని ఒకరు ఆరోపించుకుంటూ వివాదాలకు దిగిన సందర్భాలు చాలానే చూశాం. అయితే ఇప్పుడు ఇదే తరహాలో తూర్పు గోదావరి జిల్లా లో డీఆర్సీ సమావేశం జరుగుతుండగా... పలు అంశాలను చర్చిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తల మధ్య అగ్గి రాజుకుంది... నువ్వెంత అంటే నువ్వెంత అంటూ.. వివాదానికి దిగారు ఇరువురు నేతలు.

మొదటిగా పిల్లి సుభాష్‌ చంద్రబోస్ మాట్లాడుతూ కాకినాడ  టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించారు. దానికి రియాక్ట్ అయిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఒకే పార్టీలో ఉంటూ తనకు చెప్పాలి కదా అంటూ పిల్లి సుభాష్‌‌ చంద్రబోస్‌పై  మండిపడుతూ వాగ్వాదానికి దిగారు. దాంతో నిజాలు నిర్భయంగా మాట్లాడితే ఇలానే ఉంటుంది అంటూ... మేడ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ మునిగిపోయిందంటూ మరోసారి  సుభాష్‌ చంద్రబోస్ ఆరోపించారు. సుభాష్ మాటకి మాట ఎదురు చెబుతుండడంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు... దాంతో వివాదం పీక్స్ కు చేరింది. ఏదైనా ముందే నాకు చెప్పాలి కదా అంటూ విరుచుకుపడ్డారు.

అంతే కాదు ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పపై కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. ఎంతసేపటికీ వివాదం సర్దుమణగకపోవడంతో ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, సహచర ఎమ్మెల్యేలు నచ్చజెప్పి ఇరువురిని సముదాయించారు...దీంతో సమావేశం అర్థాంతరంగా ఆగిపోయింది. కాగా డీఆర్సీ సమావేశంలో చర్చించాల్సిన కొన్ని అంశాలు అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ఈ విధంగా సొంత పార్టీ కి చెందిన నాయకులూ విచక్షణారహితంగా వివాదానికి దిగడం ఏమీ బాగాలేదంటూ మిగతా నాయకులు అభిప్రాయపడుతున్నారు.  దీనిపై వైసీపీ హై కమాండ్ ఏ విధంగా స్పందించనుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: